Police Commemoration Day : 1959లో లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లో చైనా సైనికుల ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులను స్మరించుకోవడానికి ఏటా అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశాన్ని రక్షించే పోలీసు సిబ్బంది యొక్క ధైర్యసాహసాలు, సేవకు నివాళులు అర్పించేందుకు ఈ రోజు అంకితం చేయబడింది. కార్యదీక్షలో శత్రువులతో తుదివరకూ పోరాడి అమరులైన వారికి ఈ రోజు నివాళులర్పిస్తారు. దేశంలో ఉగ్రవాతులు, నక్సల్, మావోయిస్టుల దాడితోపాటు అనేక రకాల శత్రువలతో పోరాడి వందల మంది అమలయ్యారు. వీరి జ్ఞాపకార్థమే అమరవీరుల దినం నిర్వహిస్తున్నారు.
ఎందుకు జరుపుకుంటారు..
అక్టోబర్ 21నే పోలీస్ అమలరవీరుల దినత్సోవం జరుపుకుంటాం. ఇందుకు ప్రధాన కారణం 1959, అక్టోబర్ 21, భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. అక్సాయ్ చిన్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద నిఘా మిషన్‌లో ఉన్న భారతీయ పోలీసులపై చైనా దళాలు మెరుపుదాడి చేశాయి. ఎలాంటి కవ్వింపులు లేకపోయినా చైనా బలగాలు జరిపిన కాల్లుపకు అనేక మంది భారత పోలీసులు బలయ్యారు. మృతదేహాలను 23 రజుల తర్వాత అంటే 1959, నవబంర్ 12న చైనా అప్పగించింది. వీరులకు సైనిక గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి. మరుసటి ఏడాది అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరులు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రాముఖ్యత..
పోలీసు స్మారక దినోత్సవం 1959లో మరణించిన పోలీసుల గౌరవార్థం, వారిని స్మరించుకోవడానికి నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటాం. దేశీయంగా లేదా అంతర్జాతీయంగా విధి నిర్వహణలో అమరుల త్యాగాలను కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. 2018 అక్టోబర్ 21న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నేషనల్ పోలీస్ మెమోరియల్‌ను అంకితం చేశారు.
ఈ ఏడాది ఇలా..
ఇక ఈ ఏడాది పోలీసు అమరవీరులను సన్మానించే కార్యక్రమాల శ్రేణి ద్వారా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీటిలో ఇవి ఉన్నాయి. దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పాల్గొన్న కవాతులు రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు మరియు మోటార్‌సైకిల్ ర్యాలీలు వంటి కమ్యూనిటీ ఆధారిత కార్యకలాపాలు, స్థానిక పోలీస్ స్టేషన్లలో పౌరుల త్యాగాలను స్మరించుకునే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.