https://oktelugu.com/

Konaseema: అమలాపురం అల్లర్లు.. వైసీపీ నేతలే నిందితులు.. వాళ్లు ఎవరో తెలుసా?

Konaseema: కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అగ్గిరాజేసింది ఎవరో తెలిసింది. ఈప్రధాన కుట్రదారులు అందరూ ఆరోపిస్తున్నట్టు ఏ జనసేన నేతలో.. లేక ప్రతిపక్ష టీడీపీ నేతలు కాదు.. స్వయానా అధికార వైసీపీ నేతలే. వారికి వారే తగలబెట్టుకొని మంత్రి , ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టుకొని సెంటిమెంట్ రాజేశారని తాజా ఎఫ్ఐఆర్ ను బట్టి తేటతెల్లమైంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 15, 2022 / 07:53 PM IST
    Follow us on

    Konaseema: కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అగ్గిరాజేసింది ఎవరో తెలిసింది. ఈప్రధాన కుట్రదారులు అందరూ ఆరోపిస్తున్నట్టు ఏ జనసేన నేతలో.. లేక ప్రతిపక్ష టీడీపీ నేతలు కాదు.. స్వయానా అధికార వైసీపీ నేతలే. వారికి వారే తగలబెట్టుకొని మంత్రి , ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టుకొని సెంటిమెంట్ రాజేశారని తాజా ఎఫ్ఐఆర్ ను బట్టి తేటతెల్లమైంది.

    కోనసీమ జిల్లా పేరు మార్పుపై మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు.ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సత్యరుషి , సుభాష్, మురళీకృష్ణ, రఘుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అసలు దోషులు వైసీపీ మంత్రి అనుచరులే కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

    ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఏ222గా ఉన్న చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ అల్లర్లకు సంబంధించి ఏడు ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ 258 మంది నిందితులను గుర్తించారు. వారిలో 142మందిని అరెస్ట్ చేశారు. మరో 116 మంది కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల పేర్లపై రౌడీ షీట్ కూడా తెరిచారు. అమలాపురంలో నష్టానికి రెండితలు వసూలు చేస్తామని డీజీపీ హెచ్చరించారు.

    అందరూ అన్నట్టే అమలాపురం అల్లర్ల వెనుకున్నది వైసీపీ వారేనని తెలియడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపించిందే నిజమని తేలింది. కేసులు నమోదైన వారిలో మట్టపర్తి మురళీ కృష్ణ ప్రస్తుతం వైసీపీ పార్లమెంట్ బీసీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఇక వాసంశెట్టి సుభాష్ వైసీపీ నివర్గ ముఖ్యనేతగా ఉన్నారు. ఇతడి తల్లి వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్. చైర్మన్ పదవిని ఇటీవలే కోల్పోయారు. స్వయంగా మంత్రి విశ్వరూప్ ఈ అల్లర్లకు ఓ కార్పొరేటర్ కారణం అన్నారు.ఇక మట్టపర్తి రఘు, సత్యరుషి కూడా ఇద్దరూ వైసీపీ నేతలే కావడం గమనార్హం. వీరంతా స్థానిక మంత్రి విశ్వరూప్ అనుచరులు కావడంతో ఈ అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీ వారేనని అర్థమవుతోంది. ఇప్పుడితే ఏపీ రాజకీయాల్లో సంచలనమవుతోంది.