Young woman dance viral at the Bonala Fair : బోనాలు పండుగ వచ్చిందంటే చాలు ఆ మందులు, విందులు చెప్పక్కర్లేదు. ఆ ఎంజాయ్ మెంట్ యే వేరు. ఇక హైదరాబాద్ లో అయితే యమ జోరుగా సాగుతుంది. ఈ మధ్యన విడుదలైన పాటలు వేసుకొని బోనాల పండుగలో యువతీ యువకులు డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో ‘అరబిక్ పాట’.
హీరో విజయ్ , హీరోయిన్ పూజాహెగ్డే నటించిన చిత్రంలోని ఆ పాట తెగ వైరల్ అవుతోంది. నిజానికి పాటల వల్ల సినిమాకు క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాను ఆ పాట ఊపేసింది. ముఖ్యంగా యువతీ యవకులు అయితే డ్యాన్స్ వీడియోలతో నటనతో, పాటలతో డైలాగ్స్, కామెడీతో అలరిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతీ యువకులు పాపులర్ పాటలతో చేసే హంగామా అంతా ఇంతాకాదు.. తాజాగా బోనాల జాతరలో ఓ యువతి చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.
అరబిక్ పాటకు ఆ యువతి ఓ ట్రాన్స్ జెండర్ తో కలిసి చేసిన ఈ నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యమ క్యూట్ గా.. నాట్ గా ఉన్న ఈ యువతి కళ్లద్దాలు పెట్టుకొని లంగా ఓణీలో చేసిన డ్యాన్స్ ఉర్రూతలూగిస్తోంది.
విజయ్ సినిమాలోని ఈ దళిపతి పాట ఇప్పటికే 20 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పుడీ పాట యువతీ యువకులకు ఫేవరేట్ గా మారింది. ఈ యువతి డ్యాన్స్ మాత్రం తెగ ఆకట్టుకుంటోంది.