ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ రాసిన లేఖపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రెండు వర్గాలుగా వీడిపోయి మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వారు జగన్ లేఖకు మద్దతునిస్తుండగా అశ్విని ఉపాధ్యాయ వంటి వారు ఏకంగా జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని లేఖ రాయడం కలకలం రేపింది. తాజాగా అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డేకు మరో లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
Also Read: రాజధానే లేదు.. విశాఖలో మెట్రో నిర్మిస్తారట..!
సుప్రీం జడ్జిపై ఆరోపణలు చేస్తూ జగన్ ఇటీవల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖను బహిరంగ పర్చడం కోర్టు ధిక్కరణయేనని అశ్వినీ ఉపాధ్యాయ తాజాగా మరో లేఖ రాశారు. 31 కేసుల్లో నిందితుడి ఉన్న జగన్ న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన ప్రవర్తన న్యాయమూర్తులను బెదిరించేలా ఉందన్నారు. ఈ మేరకు సీఎం జగన్ రాసిన లేఖపై కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆయన కోరారు.
ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులను సత్వరం పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని అశ్వినీ ఉపాధ్యాయ గతంలో సుప్రీం కోర్టు జడ్జికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో జగన్‌పై కూడా విచారణ జరిపించి సీఎం పదవి నుంచి తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని లేఖ రాశారు. జగన్‌పై ఇప్పటికే తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని పదవికి అనర్హుడిగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
Also Read: ఏపీలో పోలవరం పాలిటిక్స్? తప్పు ఎవరిది?
అయితే సమాజంలో ప్రతి ఒక్కరి తప్పును ఎత్తి చూపే అవకాశం ఉందని, న్యాయమూర్తులు మాత్రం తప్పులు చేయరా..? అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. న్యాయమూర్తులు చేసిన తప్పులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కొందరు అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ లాంటి వారు జగన్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ విషయంలో అందరి చూపు ఇప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయంపైనే ఉంది.