Polavaram Contractor vs Sand Contractor: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక పంచాయతీ రగులుతోంది. రాష్ల్రంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ప్రభుత్వానికి ఇష్టమైన కంపెనీగా తెలిసిందే. దీంతో ఏపీలోని అన్ని పనులు చేసేందుకు ముందుకు రావడం తెలిసిందే. ఇప్పుడు ఇసుక విషయంలో ఉచితంగా ఇచ్చేందుకు జేపీ సంస్థ ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో రెండు సంస్థల మధ్య ఇసుక వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతోంది. డబ్బులివ్వనిదే ఇసుక తోడనివ్వమని చెబుతోంది. ప్రస్తుతం దీనిపై గొడవలు జరిగే వరకు వెళుతోంది.
2019 సంవత్సరంలో మేఘా కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. అప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. దీంతో సమస్య రాలేదు. కానీ తరువాత కాలంలో ఇసుక విధానంల మార్పులు చేయడంతో ఇసుక మొత్తాన్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు అప్పగించింది. దీంతో ఇక మేఘా కంపెనీకి ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. మేఘా సంస్థకు ఉచితంగా ఇవ్వడానికి నిరాకరిండంతో ప్రాజెక్టు పనులు పెండింగులో పడినట్లు తెలుస్తోంది.
Also Read: పెగాసస్ పై వైసీపీ దూకుడు, మమత ఆరోపణలతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ చేస్తారా?
గత ప్రభుత్వం ఇచ్చిన హామీతో మేఘా కంపెనీ చురుకుగా పని చేసినా తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు చేయడంతో ఉచితంగా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గత ప్రభుత్వంలో నవయుగ సంస్థ పోలవరం పనులు చేసింది. తరువాత వచ్చిన మేఘా కంపెనీకి మొదట ఉచితంగానే ఇసుక దొరికినా తరువాత ధర చెల్లించాల్సి రావడంతో మేఘా కష్టాల్లో పడుతోంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ మేఘాకు ఇసుక ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో రెండు సంస్థల మధ్య పంచాయితీ వస్తోంది. రెండు కంపెనీలు జగన్ కు కావాల్సినవే కావడంతో ఏ మేరకు పంచాయితీ పరిష్కరిస్తారో తెలియడం లేదు. అందరు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read: అందరం తిలకించి విజయవంతం చేద్దాం – చిరంజీవి