https://oktelugu.com/

Highest Grossing Indian Movies: అత్య‌ధిక టికెట్లు అమ్ముడు పోయిన ఇండియ‌న్ సినిమాలు ఇవే.. బాహుబ‌లి స్థానం ఎంతంటే..?

Highest Grossing Indian Movies: ఇండియన్ సినిమాల‌లో ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక సినిమా రేంజ్‌ను అది క‌లెక్ట్ చేసిన వ‌సూళ్ల‌ను బ‌ట్టి డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మాత్రం ఆ మూవీ థియేట‌ర్ల‌లో ఎన్ని రోజులు ఆడిందో, ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయో అనే దాని మీద ఆధారప‌డి ఉండేది. మ‌రి మ‌న ఇండియ‌న్ సినిమాల‌లో ఏ మూవీల‌కు ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొద‌ట‌గా చెప్పుకోవాల్సింది […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 23, 2022 / 01:39 PM IST
    Follow us on

    Highest Grossing Indian Movies: ఇండియన్ సినిమాల‌లో ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక సినిమా రేంజ్‌ను అది క‌లెక్ట్ చేసిన వ‌సూళ్ల‌ను బ‌ట్టి డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మాత్రం ఆ మూవీ థియేట‌ర్ల‌లో ఎన్ని రోజులు ఆడిందో, ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయో అనే దాని మీద ఆధారప‌డి ఉండేది. మ‌రి మ‌న ఇండియ‌న్ సినిమాల‌లో ఏ మూవీల‌కు ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయో ఇప్పుడు చూద్దాం.

    ఇందులో మొద‌ట‌గా చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్ న‌టించిన హ‌మ్ ఆప్ కే హై కౌన్‌. ఈ మూవీ ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా నిలిచింది. ఈ మూవీకి 7,39,67000 టికెట్లు అమ్ముడు పోయాయి. దీని త‌ర్వాత ప్లేస్ లో అమితాబ్ న‌టించిన షోలే మూవీ నిలిచింది. దానికి 5,52,34000 టికెట్లు అమ్ముడు పోయాయి.

    Hum Aapke Hain Koun

    ఇక మూడో స్థానంలో రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి-2 నిలిచింది. ఈ మూవీకి 5,40,43000 టికెట్లు అమ్ముడు పోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయిన సినిమాల్లో దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉండ‌గా.. అందులో మ‌న తెలుగు సినిమా చోటు ద‌క్కించుకుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా ఈ లిస్టులో లేదు.

    Also Read: RRR First Full Review: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

    Baahubali 2

    నాలుగో స్థానంలో గాదర్‌.. ఏక ప్రేమ్ క‌థ మూవీ నిలిచింది. ఈ మూవీ 5,09,54000 టికెట్లు అమ్ముడు పోయింది. దీరి త‌ర్వాత షారుఖ్ న‌టించిన దిల్ వాలే దుల్హ‌నియా లేజాయింగే మూవీ ఉంది. దీనికి 4,80,89000 టికెట్లు అమ్ముడు పోయాయి. ఆరో స్థానంలో అమీర్ ఖాన్ న‌టించిన రాజా హిందుస్థాని నిలిచింది. దీనికి 4,09,56000 టికెట్లు అమ్ముడు పోయాయి.

    GADAR

    బార్డ‌ర్ మూవీ కూడా 3,70,21000 టికెట్ల‌తో ఏడో స్థానంలో నిలిచింది. ఇక ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ మూవీ దంగ‌ల్ 3,69,32000 టికెట్లు అమ్ముడు పోయింది. తొమ్మిదో స్థాన‌లో షారుఖ్ న‌టించిన కుచ్ కుచ్ హోతా హై మూవీ నిలిచింది. దీనికి 3,56,11,000 టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక ప‌దో స్థానంలో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన భ‌జ‌రంగీ భాయిజాన్ మూవీ ఉంది. దీనికి 3,54,12000 టికెట్లు అమ్ముడు పోయాయి.

    Also Read:  ఉత్తరఖాండ్ నుంచి మనస సరోవర్ యాత్ర.. ఇక ఇలా ఈజీగా వెళ్లొచ్చు

    Tags