https://oktelugu.com/

పోలవరం: టీడీపీ, వైసీపీతో కేంద్రం ఆట!

పార్లమెంట్‌ వేదికగా ఏ చట్టం చేసినా దానికి కేంద్రం కట్టుబడాల్సిందే. అందుకు రాష్ట్రాలు కూడా సహకరించాల్సిందే. కానీ.. పోలవరం విషయంలో ఆ ప్రామిస్‌ కాస్త పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అయితే.. ఈ మధ్య ప్రాజెక్టు అంచనాలను పాత ప్రకారమే ఇస్తామంటూ కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పరిస్థితి దయనీయంగా తయారైంది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2020 / 02:04 PM IST
    Follow us on

    పార్లమెంట్‌ వేదికగా ఏ చట్టం చేసినా దానికి కేంద్రం కట్టుబడాల్సిందే. అందుకు రాష్ట్రాలు కూడా సహకరించాల్సిందే. కానీ.. పోలవరం విషయంలో ఆ ప్రామిస్‌ కాస్త పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అయితే.. ఈ మధ్య ప్రాజెక్టు అంచనాలను పాత ప్రకారమే ఇస్తామంటూ కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పరిస్థితి దయనీయంగా తయారైంది.

    Also Read: అప్పుడే 6 కోట్ల ఓట్లు.. అమెరికా ఓటర్ల తీర్పు ఎటువైపు?

    ఇదిలా ఉంటే.. అటు ఏపీలోని బీజేపీ మాత్రం వింత వాదన చేస్తోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్ట్ విషయంలో స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు నిర్లక్ష్యం చేశాయని వితండవాదానికి దిగుతోంది. ప్రజల దృష్టిలో కూడా ఇదే ఫోకస్ చేసి లబ్ధి పొందాలని కమలనాథులు ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌కు పెరిగిన అంచనా వ్యయం దాదాపు రూ.27 వేల కోట్లు భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేననే పరిస్థితిని కేంద్రం ఇప్పుడు కల్పించింది. గత టీడీపీ కూడా 2014 అంచనాల ప్రకారం అని అంగీకరించడం ద్వారా తరువాత పెరిగే వ్యయానికి కేంద్రానికి సంబంధం లేదన్నట్లు ఒప్పుకుని రాష్ట్ర వాసులపై పెను భారం మోపేలా కుదుర్చుకున్న ఒప్పందం గుదిబండలా తయారైంది.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే ఆర్టీసీ ద్వారా వేలాది మందిని అక్కడికి తరలించి నానా ఆర్భాటం చేసేసింది. దీని ద్వారా సుమారు 400 కోట్ల వరకు ప్రభుత్వానికి లాస్‌. అలాగే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ లను కూడా తమ వారికి కట్టబెట్టడం ద్వారా అయాచిత లబ్ధిపొందింది. ఇదే ఆరోపణలు వైసీపీ ఎన్నికల ముందు చేసింది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.58 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల రూపాయలకు రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గించింది. ఇన్ని చేసినా ప్రయోజనం లేనట్లు ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పెరిగిన అంచనా వ్యయంతో కేంద్ర సర్కార్‌‌కు సంబంధం లేనట్లు గతంలో ప్రభుత్వం ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడం సరికొత్త చర్చకు తెరతీసింది.

    Also Read: యాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

    ఇదిలా ఉండగా.. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని టీడీపీ చేపట్టింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా కేంద్రానికి అప్పజెప్పలేదు. దీంతో వారు కాంట్రాక్టర్లను మార్చి కొనసాగించారు. అంచనా వ్యయం కానీ, ముంపు ప్రాంతాల పరిహారాలు తదితర సమస్యలు కేంద్రం రాష్ట్రం నెత్తిన పెట్టె అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రానికి అప్పగించాలని పలువురు నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పారు. అలా చేయకుండా ఇప్పుడు జగన్‌ సర్కార్‌‌ తల పట్టుకుంది. ప్రాజెక్ట్ క్రెడిట్ సంగతి ఎలా ఉన్నా కేంద్రానికే అప్పగించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాయడంతో పాటు అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి గుదిబండలా తయారైంది.