PM Modi: బీజేపీ అప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికలకు మూడేళ్ల టైం ఉన్నప్పటికీ వ్యూహాలను ఇప్పటి నుంచే రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే తగు చర్యలుంటాయని సీరియస్‌గానే హెచ్చరించారు. బీజేపీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారనే విషయాలపై స్పెషల్ ఫోకస్..

దేశరాజధాని న్యూ ఢిల్లీ జన్ పథ్ రోడ్డులోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న టైంలో ఇలా అధికార పార్టీ బయట సమావేశం అవడం ఇదే తొలిసారి. పార్లమెంటు బిల్డింగ్‌లో రిపెయిర్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇలా బయట సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఉపన్యాసం చేశారు. కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, జైశంకర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఉభయ సభలకు చెందిన బీజేపీ ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ సొంత పార్టీ ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
‘పాఠశాలలో చదువుకునే పిల్లలు ఏదేని విషయం చెప్తే అర్థం చేసుకుంటారని, వారు మళ్లీ మళ్లీ ఆ విషయాన్ని చెప్పించుకోవడానికి ఇష్టపడరని, అలాంటిది బాధ్యత గల పదవుల్లో ఉన్న మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు. ఇలాగే వ్యవహరిస్తే అవసరమైన మార్పులు జరుగుతాయి. అందుకు సిద్ధంగా ఉండండి’ అని మోడీ ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అటెండెన్స్ పర్సంటేజీ తగ్గిపోవడం, ప్రొసీడింగ్స్ జరుగుతున్న టైంలో ఎంపీలు హాజరుకాకపోవడం పట్ల ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోనే మూడో కూటమి ఏర్పాటు జరిగేనా?
ఎంపీలు ఇలాగే ఉంటే కుదరబోదని, పరివర్తన చెందాలని హితవు పలికారు. ఎంపీలనుద్దేశించి భారత ప్రధాని మోడీ తీవ్రస్వరంతో మాట్లాడారు. ప్రజారోగ్యంపై ఎంపీలు దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ఎంపీల ఆధ్వర్యంలో కిసాన్ సమ్మేళనాలు నిర్వహించాలని తెలిపారు. మొత్తంగా పార్లమెంటు సమావేశాలనుద్దేశించి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇందులో నిగూఢ అర్థంగా పార్టీని ఇప్పటి నుంచే మళ్లీ ఎన్నికల కోసం సమాయత్తం చేసే ఉద్దేశం ఉందేమోనని పలువురు అంచనా వేస్తున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం నవంబర్ 15ను జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ గిరిజన ఎంపీలు ప్రధాని మోడీని సన్మినించారు. బిర్సాముండ జయంతిని జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Also Read: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!