PM Narendra Modi : 2024 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బిజెపి కాస్త ఇబ్బంది పడింది. దీంతో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ అనేక రికార్డులను నెలకొల్పారు. ఇక పరిపాలన విషయానికొస్తే కొన్ని విషయాలు మినహాయిస్తే మిగతా వాటిల్లో నరేంద్ర మోడీ విజయవంతమయ్యారని చెప్పవచ్చు. తనకంటూ పటిష్టమైన అధికార వ్యవస్థను నరేంద్ర మోడీ ఏర్పరచుకున్నారు. సమర్థవంతమైన అధికారుల సమూహాన్ని ప్రధానమంత్రి ఆఫీసులో నియమించుకున్నారు.. అందువల్లే పలు నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత వేగంగా తీసుకోగలుగుతున్నారు.. దౌత్య పరంగా, విదేశాంగ విధానపరంగా, ఆర్థికపరంగా నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకున్న అధికారుల సమూహం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే దేశం ఇంత బలంగా ఉంది. ఆర్థికంగా ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ భారత్ సమర్థవంతంగానే ఉంది.. కోవిడ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఉందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారుల సమూహం తీసుకున్న నిర్ణయాలే.
Also Read : ‘ఏప్రిల్ 1న సెలవు.. ఉత్తర్వులు జారీ.. ఎందుకోసమంటే..
సమర్థవంతమైన అధికారులు..
ప్రధానమంత్రి కార్యాలయంలో సమర్థవంతమైన అధికారులు ఉంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో.. దేశ భద్రత, అభివృద్ధికి సంబంధించిన విషయంలో వారు ఏమాత్రం రాజీపడరు. అందువల్లే వారిని నరేంద్ర మోడీ ఏరి కోరి నియమించుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో 35 సంవత్సరాల అధికారి చేరారు. ఆమె పేరు నిధి తివారి. 2014 ఐఎఫ్ఎస్ అధికారి. ఈమె స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ముందుగా ఆమె వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలో పనిచేశారు. 2022 సంవత్సరంలో ప్రధానమంత్రి కార్యాలయంలో చేరారు. ఆ సమయంలో అండర్ సెక్రటరీగా పని చేశారు. ఆ తర్వాత ప్రమోషన్ పొంది డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. ఇంగ్లీషు, ఇతర ఫారిన్ లాంగ్వేజెస్ లో నిధి తివారికి విపరీతమైన పట్టు ఉంది. అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈమెకు అవగాహన ఉంది. పైగా కష్టపడి పని చేసే తత్వం.. అన్నింటికీ మించి అవినీతి లాంటి వ్యవహారాలకు దూరంగా ఉండటంతో ఈమెను ప్రధానమంత్రి కార్యాలయానికి ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈమె నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేస్తారు. ఈమె వయసు 35 సంవత్సరాలు. ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల జాబితాలో నిధి తివారిఅత్యంత చిన్న వయసు ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు.. చాకచక్యంగా మాట్లాడగల నైపుణ్యం.. సమస్యల పరిష్కారానికి చూపించే చొరవ.. ప్రభుత్వ విభాగాలపై ఉన్న పట్టు కారణంగానే నిధి తివారిని ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శిగా ఎంపిక చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : ఈ-చలాన్ విషయంలో ఇకపై నో ఛాన్స్.. ఉల్లంఘిస్తే భారీ నష్టాలు తప్పవు