Modi Visit to Hyderabad: ఎట్లన్నజేసి తెలంగాణలో ఎదగాలన్నదే బీజేపీ అనుసరిస్తున్న విధానంగా తెలుస్తున్నది. అందుకు కోసం కేంద్ర నాయకత్వాన్ని పదే పదే హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు. మోడీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. కానీ ఈసారి మళ్లీ వస్తున్నారు. ఈ సారి ఏకంగా 3 రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేస్తున్నారు. జూలై నెలలో హైదరాబాద్ హైటెక్స్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ సమావేశాల దృష్ట్యా ప్రధాని మోడీ, అమిత్‌షాలు మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నట్టు సమాచారం.
బీజేపీ అంటే కేసీఆర్‌లో భయం పట్టుకుందని, అందుకే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇటీవల మోడీ హైదరాబాద్ వస్తే పనిగట్టుకుని కేసీఆర్ బెంగళూరు వెళ్లారని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలే ఫ్రస్టేషన్‌లో ఉన్న కేసీఆర్‌కు మరింత సెగ తగిలించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల దృష్ట్యా దేశం మొత్తం చూపు తెలంగాణే మీదే ఉండబోతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలు బీజేపీకి కీలకంగా మారనున్నాయి.
Also Read: CM KCR- Nikhat Zareen- Esha Singh: కేసీఆర్ సార్.. ఇంత ఆర్థిక దుస్థితిలో వారికి రెండు కోట్లా?
రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ విపక్షాలను కలుపుకుని ఓ ప్రత్యేక అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే బాంబ్ పేల్చబోతున్నట్టు తెలుసుకుని బీజేపీ ముందస్తుగా కేసీఆర్ ఇలాకాలోనే సొంత బలం కూడగట్టేందుకు భారీగా సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది. ఇదే జరిగితే కేసీఆర్‌కు బీజేపీని నిలవరించేందుకు కష్టపడాల్సి వస్తుంది. తెలంగాణ మొత్తం బీజేపీ వైపు చూస్తుంటే తెలంగాణ ప్రజానీకాన్ని తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ మరింత వ్యూహరచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలైందా అన్నట్టుగా ఎవరికివారు ప్లాన్ వేస్తుండటం గమనార్హం.
Also Read:Star Heros Who Missed Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?