Bharateeyudu 2: కమల్ హాసన్ మరియు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పాతికేళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటో డైరెక్టర్ శంకర్ ఈ సినిమా ద్వారా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పవర్ ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి పరిచయం చేసాడు..అప్పట్లో ఈ సినిమా విడుదల అయినా అన్ని బాషలలో కలెక్షన్ల కనకవర్షం కురిపించింది..ఇప్పటి వరుకు డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమాలలో కంటెంట్ పరంగా మరియు మేకింగ్ పరంగా ఈ సినిమా ఇప్పటికి నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాకి డైరెక్టర్ శంకర్ రెండేళ్ల క్రితం సీక్వెల్ ని ప్రకటించి దాదాపుగా 50 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది..50 శాతం పూర్తి అయినా షూటింగ్ కి గాను, ఆ చిత్ర నిర్మాత సుభాస్కరన్ అల్లి రాజు దాదాపుగా 150 కోట్ల రూపాయిలు ఖర్చు చేసాడు..అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో దురదృష్టం కొద్దీ ఒక్క ప్రమాదం జరిగి ముగ్గురు సాంకేతిక నిపుణులు చనిపోవడం..ఇక ఆ తర్వాత కరోనా కారణంగా భారీ లాంగ్ గ్యాప్ రావడం తో వల్ల అప్పటి వరుకు ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ ఇప్పుడు అందుబాటులోకి లేకపోవడం తో శంకర్ ఈ సినిమాని మధ్యలోనే ఆపివేశాడు.
భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తి చెయ్యకుండా రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయినా శంకర్ పై ఆ చిత్ర నిర్మాత సుభాస్కరన్ అల్లి రాజ్ అప్పట్లో కేసు కూడా వేసాడు..తనకి సంబంధించిన సాంకేతిక నిపుణులు అందరూ తిరిగి వస్తేనే ఈ సినిమాని పూర్తి చేస్తాను అని శంకర్ తెగేసి చెప్పడం తో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది..ఇది ఇలా ఉండగా కమల్ హస్సన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం విక్రమ్ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్ర ప్రొమోషన్స్ లో కమల్ హస్సన్ బిజీ గా ఉన్నాడు..విక్రమ్ మూవీ ప్రొమోషన్స్ కోసం కమల్ హస్సన్ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో భారతీయుడు సీక్వెల్ మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడగగా, కమల్ హాసన్ దానికి సమాధానం చెప్తూ ‘ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేది అనేది తన చేతుల్లో ఏమి లేదు..అది పూర్తిగా శంకర్ గారి చేతుల్లో ఉన్నది..ఆయన ఎప్పుడు పిలిచినా డేట్స్ ఇచ్చి ఆ సినిమా ని పూర్తి చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కమల్ హాసన్..తమిళ్ ప్రేక్షకుల తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందో చూడాలి.
Also Read: How to Abolish Caste System : కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి?
Recomended Videos