https://oktelugu.com/

కరోనా కట్టడికి ప్రధాని నిధి ‘పీఎం-కేర్స్‌’

కోవిడ్‌-19ని కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు సేకరణ కోసం.. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర నిధి (పీఎం-కేర్స్‌)ని ఏర్పాటు చేశారు. దీనికి నిధులు ఇవ్వడం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూత ఇవ్వాలని దేశ ప్రజలకు ఆయన పిలుపిచ్చారు. కోవిద్-19పై పోరాటానికి అండగా నిలబడాలనుకునే వారు పీఎం-కేర్స్‌కు విరాళాలు అందించాలని కోరారు. ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొ ప్రజలను ఆదుకోవడానికి […]

Written By: , Updated On : March 29, 2020 / 12:42 PM IST
Follow us on

కోవిడ్‌-19ని కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు సేకరణ కోసం.. ప్రధానమంత్రి పౌర సహాయ, ఉపశమన అత్యవసర నిధి (పీఎం-కేర్స్‌)ని ఏర్పాటు చేశారు. దీనికి నిధులు ఇవ్వడం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూత ఇవ్వాలని దేశ ప్రజలకు ఆయన పిలుపిచ్చారు.

కోవిద్-19పై పోరాటానికి అండగా నిలబడాలనుకునే వారు పీఎం-కేర్స్‌కు విరాళాలు అందించాలని కోరారు. ఆరోగ్యకర దేశాన్ని తయారు చేసేందుకు ఈ నిధిని వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొ ప్రజలను ఆదుకోవడానికి ఈ నిధిని ఉపయోగిస్తామని చెప్పారు. www.pmindia.gov.in సైట్‌లో విరాళాలు చెల్లించాలని ప్రధాని సూచించారు.

తక్కువ విరాళాలను కూడా తీసుకుంటా డానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ప్రధాని తెలిపారు. ఆరోగ్యకరమైన, శ్రేయస్కరమైన దేశాన్ని భవిష్యత్తు తరాలకు అందించే సమయం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు.

పీఎం-కేర్స్‌ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ట్రస్ట్‌ సభ్యుల్లో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా ఉంటారు.

కాగా, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ పీఎం కేర్స్‌కు తొలివిరాళం రూ.25 కోట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశ ప్రజల ప్రాణాల రక్షణే తనకు ముఖ్యమని ఆయన ట్వీట్‌ చేశారు. అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా తన భర్తను కొనియాడారు.

ఇంత పెద్ద మొత్తం ఎలా ఇస్తావని తాను ప్రశ్నించగా.. ‘మొదట్లో ఏమీ లేని నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. ఏమీ లేని వారి కోసం నేను ఏమీ చేయకుండా ఎలా ఉండగలను’ అని అక్షయ్‌ చెప్పారని, ఆయనను చూస్తే గర్వంగా ఉన్నదని ఆమె ట్వీట్‌ చేశారు.