భారత్ లో 1,000కి దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.24 మంది చనిపోయారు. 85 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక 81, తెలంగాణ 67, ఉత్తరప్రదేశ్ 65,గుజరాత్ 55, రాజస్థాన్ 54, ఢిల్లీ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 6 మంది కరోనాతో చనిపోయారు.ఆ తర్వాత గుజరాత్ లో […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 2:45 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1029 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.24 మంది చనిపోయారు. 85 మంది కోలుకున్నారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 186, కేరళలో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటక 81, తెలంగాణ 67, ఉత్తరప్రదేశ్ 65,గుజరాత్ 55, రాజస్థాన్ 54, ఢిల్లీ 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 6 మంది కరోనాతో చనిపోయారు.ఆ తర్వాత గుజరాత్ లో 4, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2 మరణాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కరోనాతో ఒకరు చనిపోయారు.

కాగా, కరోనా అమెరికాకు, యూరప్లకు చుక్కలు చూపిస్తోంది. ల‌‌క్ష కేసులు దాటిన మొదటి దేశంగా అమెరికా నిలిస్తే, 3 లక్షల‌‌కు పైగా కేసుల‌‌తో ప్రపంచంలో సగం కేసులు ఐరోపాకు పరిమిత కావడం గమనార్హం. ఇట‌‌లీ, స్పెయిన్‌‌లోనూ ప‌‌రిస్థితి మ‌‌రింత దిగ‌‌జారిపోతోంది. ఇట‌‌లీలో ఒక్కరోజే వెయ్యి మంది, స్పెయిన్‌‌లో 837 మంది బ‌‌ల‌‌య్యారు. ఫ్రాన్స్‌‌, ఇరాన్‌‌‌‌లోనూ ప‌‌రిస్థితి ఏమంత బాగాలేదు.

ప్రపంచ‌‌వ్యాప్తంగా 6,63,431 మంది క‌‌రోనాకు బాధితుల‌‌య్యారు. చ‌‌నిపోయిన వారి సంఖ్య 30 వేలు దాటింది. 30,865 మంది ఇప్పటిదాకా క‌‌రోనాకు బ‌‌ల‌‌య్యారు. 1,41,953 మంది కోలుకున్నారు. స్పెయిన్‌‌లో ఒక్కరోజే 552 మంది చ‌‌నిపోయారు. బ్రిట‌‌న్‌‌లో మ‌‌ర‌‌ణాలు వెయ్యి మార్కును దాటాయి. 1,019 మంది చ‌‌నిపోయారు.

ఇరాన్ లో గత 24 గంటల్లో 3 వేలకు పైగా కొత్త కేసులొచ్చాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 2,517 మంది చనిపోయారని, 3,200 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆఫ్రికా ఖండంలోనూ మెల్లమెల్లగా వైరస్‌‌‌‌‌‌‌‌ ఉధృతి పెరుగుతోంది.

దక్షిణాఫ్రికాలో తొలి కరోనా మరణం నమోదవడంతో ఆ దేశం శుక్రవారం నుంచి మూడు వారాల లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. కెన్యాలో కర్ఫ్యూ హింసాత్మకమైంది. ఫెర్రీలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు టియర్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ప్రయోగించారు.

‘నన్ను క్షమించండి. కొంత మంది చనిపోతారు.. చనిపోతారు. అదే జీవితం’ అంటూ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు జెయిర్‌‌‌‌‌‌‌‌ బొల్సోనారో వివాదాస్పద వాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదంటూ బొల్సోనారోపై అక్కడి రాష్ట్రాల గవర్నర్లు విమర్శలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే ఆయన చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.