ప్రధానితో కశ్మీర్ నేతలు.. రాష్ట్రహోదానే సమస్య

బీజేపీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంది. దానికున్న ప్రత్యేక హోదాను తొలగించి భారతదేశంలో విలీనం చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అయింది. 370 ఆర్టికల్ రద్దు ఓ సాహసమే. దాన్ని ప్రభుత్వం సాధించింది. దీంతో దేశమంతా సంతోషం వెల్లివిరిసిది. దేశ ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దానికి ఇచ్చే రాష్ర్ట హోదా విషయంతో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. జమ్మూకాశ్మీర్ కు […]

Written By: Srinivas, Updated On : June 24, 2021 5:39 pm
Follow us on

బీజేపీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంది. దానికున్న ప్రత్యేక హోదాను తొలగించి భారతదేశంలో విలీనం చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అయింది. 370 ఆర్టికల్ రద్దు ఓ సాహసమే. దాన్ని ప్రభుత్వం సాధించింది. దీంతో దేశమంతా సంతోషం వెల్లివిరిసిది. దేశ ప్రతిష్ట ఇనుమడించింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దానికి ఇచ్చే రాష్ర్ట హోదా విషయంతో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. జమ్మూకాశ్మీర్ కు చెందిన ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలతో ప్రధాని సమావేశం కానున్నారు. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

ఆ సమయంలో జమ్మూకాశ్మీర్ కు రాష్ర్ట హోదా ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోడీ చెప్పినట్లు తెలిసిందే. జమ్ముకాశ్మీర్లో 2018లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూలిపోయిన తరువాత నుంచి రాష్ర్టపతి పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నరేంద్రమోడీ, జమ్మూకాశ్మీర్ నేతలతో సమావేశం ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానితో భేటీ సందర్భంలో ఇప్పటికే జమ్మూకాశ్మీర్ నేతలు దేశ రాజధానికి చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఏడు పార్టీలు కలిసి గుప్కార్ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)తోపాటు ఏడు పార్టీలున్నాయి. గత కొంతకాలం క్రితం జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లోను ఈ పార్టీలు కూటమిగానే పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధించాయి. అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. జమ్మూకాశ్మీర్ కు రాష్ర్ట హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. జమ్మూకాశ్మీర్ రాజకీయ నేతలతో ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు.