అవును.. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మన ప్రధాని నరేంద్రమోడీకి బాగా తెలుసు. అందుకే జాతీయవాదం ఆయన అస్త్రమైంది. సార్వత్రిక ఎన్నికల ముందర పాకిస్తాన్ తో ఫైట్ ఆయనకు లాభమైంది. ఇప్పుడు కరోనాను కంట్రోల్ చేయలేక.. 20 లక్షల కోట్ల మోడీ ప్యాకేజీ ఒట్టి గ్యాస్ అన్న విమర్శల వేళ కూడా మోడీ మళ్లీ ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయిపోయాడు. ఈరోజు మోడీ చేసిన చర్యతో ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్ని సమస్యలు, అభివృద్ధి లేకున్నా.. కరోనా ఉపద్రవం ముంచుకొస్తున్నా కానీ మోడీ ఈరోజు వేసిన అడుగు చూసి ప్రజలంతా శభాష్ మోడీ అనేస్తున్నారు.
అవును.. దీన్నిబట్టే ప్రధాని మోడీకి తెలిసినంతగా ప్రజా నాడి ఎవరికీ తెలియదని.. వారి భావోద్వేగాలే తనను పాపులర్ చేస్తాయని మోడీ నిరూపించారు. ఇన్నాళ్ల విమర్శలను ఒక్క చర్యతో పటాపంచలు చేశారు.
బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!
భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద సాహసయాత్ర చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం లడ్డాఖ్ లో మోడీ ఆకస్మికంగా పర్యటించారు.
శుక్రవారం ఉదయం సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి మోడీ లేహ్ కు చేరుకున్నారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై సైనిక అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించారు.అలాగే టాప్ కమాండర్లతోనూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో తాజాగా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకోనున్నారు. సైన్యాధికారులు, సైనికులతో భేటి అయ్యారు. ముక్కులకు మాస్క్ లతో మోడీ, సైనికులు సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ ఈ భేటిలో పాల్గొన్నారు.
రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?
జూన్ 15న గల్వాల్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో మృతిచెందిన 20మంది సైనికులకు నివాళులర్పించిన మోడీ.. దాడిలో గాయపడ్డ సైనికులను సైతం ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు.
భారత సైనికులకు భరోసానివ్వడం.. చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని మోడీ చైనా సరిహద్దుల్లో పర్యటించే సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇంతటి ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ లఢక్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో యుద్ధానికి సిద్ధమైన మన జవాన్లకు భరోసానిచ్చిన మోడీని చూసి ఇప్పుడు దేశమంతా శభాష్ మోడీ అంటోంది. అందుకే అన్నారు మోడీ జాతీయవాదం ఫార్ములా ముందు అన్ని ఫెయిల్యూర్స్ దిగదుడుపేనని.. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మోడీకి తెలుసు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-నరేశ్ ఎన్నం