https://oktelugu.com/

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. పరిస్థితి చేయిదాటుతోందా?

తెలంగాణలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 3, 2020 / 02:02 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న పరిస్థితి నెలకొంది.

    పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

    ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కార్యాలయాల్లో కరోనా తిష్టవేసి కూర్చుంది. దీంతో సిబ్బంది భయంభయంగానే పనులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలెవరూ కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలెవరెవరికీ కార్యాలయంలోని అనుమతి లేదని స్పష్టం చేసింది. పనులపై ఎలాంటి ఫిర్యాదులున్నా ఆన్ లైన్లోనే సంప్రదించాలని కోరిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు కరోనా పాకింది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను కరోనా సెగ తాకింది. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.

    ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వీరితో కాంటాక్ట్ అయిన వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. ప్రగతి భవన్లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రగతి భవన్‌కు వచ్చే సందర్శకులపై అధికారులు ఆంక్షలు పెడుతున్నారు.

    బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

    సీఎం కేసీఆర్ తన అధికారిక కార్యకలాపాలన్ని ప్రగతి భవన్ నుంచే చేస్తుంటారు. పరిపాలనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్న ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటారు. అలాంటి ప్రదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం యంత్రాంగం హడలిపోతుంది. ఎవరినీ ప్రగతి భవన్లోకి రాకుండా చర్యలు చేపడుతుంది. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. అయితే సీఎం కేసీఆర్ గత నాలుగురోజులుగా ప్రగతి భవన్లో ఉండటం లేదని తెలుస్తోంది. ఆయన గజ్వేల్లోని తన ఫౌంహౌజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రగతి భవన్లో వచ్చేలోపే పరిసరాలను శానిటైజ్ చేయనున్నారు. అయితే ప్రగతి భవన్లో కరోనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదవడం గమనార్హం. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం నమోదైన 1,213 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులుండగా 8మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ తర్వాత స్థానాల్లో మేడ్చెల్ 54, రంగారెడ్డిలో 48, ఖమ్మం 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9లు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది కరోనా నుంచి కోలుకున్నారు.