ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 6వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం జరిగింది.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. అయితే.. ఈ సమావేశంలో మోడీ ప్రసంగమే తప్ప ఎక్కడా పైసా విదిల్చిన దాఖలు కనిపించలేదు. సీఎంలు చెప్పిన మాటలు విని.. తగిన హామీలు ఇవ్వడం తప్ప.. వాటికి పెద్దగా పరిష్కార మార్గాలైతే చూపించనట్లుగా కనిపించలేదు. రాష్ట్రాలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన కేంద్రం పైపై మాటలకే సరిపోతోందంటూ ఆయా రాష్ట్రాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..?
కేంద్ర, రాష్ట్రాలు కలిసి పయనిస్తేనే సమాఖ్య స్ఫూర్తిగా అర్థమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. భారత్‌ను ఆత్మ నిర్భర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని మోడీ అన్నారు. ప్రైవేటు రంగం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
‘అంత క్లిష్ట కరోనా సమయంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలసి పనిచేశాయి. దీంతో వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశం విజయం సాధించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో లక్ష్యం దిశగా పయనించడమే దేశ అభివృద్ధికి పునాది. అదే సమాఖ్య స్ఫూర్తికి అర్థం. అప్పుడే ఆర్థిక వృద్ధి కూడా సాధించలం. ఇదొక్కటే కాదు.. రాష్ట్రాలతో పాటు జిల్లాల మధ్య కూడా పోటీ, సహకారం ఉండాల్సిన అవసరం ఉంది.’ అని మోడీ చెప్పుకొచ్చారు. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలోనూ దేశం విజయం సాధించిందని.. ప్రపంచం ముందు భారత్ తన ఖ్యాతిని మరింత పెంచుకుందని చెప్పారు.
Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి
ఈ ఏడాది బడ్జెట్‌పై దేశమంతా సానుకూల స్పందన రావడం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పడుతోందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని.. ఇలాంటి సమయంలో ప్రజలు సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదని మోడీ చెప్పారు. ముఖ్యంగా యువత అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక పథకాలు ప్రతి ఒక్కరికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.
కాగా.. ఈ వర్చువల్ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి అయోగ్ సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన లద్దాఖ్, జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కానీ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం భేటీకి దూరంగా ఉన్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్