21 రోజులు… సంపూర్ణ లాక్ డౌన్!

దేశంలో కారోన మహమ్మారి దెబ్బతో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కారోన వైరస్ ని రష్యా తరహాలో కట్టడి చేసి ప్రజలకు క్షేమాన్ని అందించటం కోసం మరింత కఠిన చర్యలకు పచ్చ జెండా ఊపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. రానున్న 21 రోజులు దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. ఈ రోజు అర్ధ అర్ధరాత్రి 12 గంటల  […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 9:07 pm
Follow us on

దేశంలో కారోన మహమ్మారి దెబ్బతో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కారోన వైరస్ ని రష్యా తరహాలో కట్టడి చేసి ప్రజలకు క్షేమాన్ని అందించటం కోసం మరింత కఠిన చర్యలకు పచ్చ జెండా ఊపారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. రానున్న 21 రోజులు దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. ఈ రోజు అర్ధ అర్ధరాత్రి 12 గంటల  నుండే సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు మోడీ తెలిపారు. కాబట్టి ప్రజలు రానున్న 21 రోజులు ఇంటి నుండి బయటకు రావొద్దని సూచించారు.

మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో కఠిన చర్యల అమలుకు అధికారులకు సర్వహక్కులు ఇస్తూనే.. ప్రజలకు పలు జాగ్రత్తలు తెలియజేసారు. అవసరమైతే కేంద్రం నుంచి ఆర్మిని దింపి లాక్ డౌన్ ని అమలపరుస్తామని తెలిపారు.