Prabhas And Mahesh: ప్రభాస్, మహేష్ సినిమాలో ఈ కామన్ పాయింట్లు గమనించారా?

రీసెంట్ గా ప్రభాస్‌ సినిమా యూజ్‌ చేసిన బుజ్జి కారు గుర్తుందా. దీన్ని రీసెంట్‌గా రైడ్‌ చేశారు నాగచైతన్య. కల్కి 2898ఏడీ టీమ్‌ పడిన కష్టాన్ని ప్రశంసించారు. ఇలా చైతూ మాట్లాడారంటే ప్రభాస్ సినిమాను ఆయన ప్రమోట్ చేసినట్టే.

Written By: Swathi, Updated On : May 30, 2024 6:58 pm

Prabhas And Mahesh

Follow us on

Prabhas And Mahesh: విజయం సాధించాలి అంటే ఒకరి సహాయం కోరాల్సిందే. బయటి వారి సహాయం అయినా ఇంట్లో వారి సహాయం అయినా సరే కచ్చితంగా సహాయం ఉండాలి. ఒక స్టేజ్ కి వెళ్లాలంటే ఇది కంపల్సరీ. కానీ సక్సెస్ అయిన తర్వాత వేరే వాళ్లకు కచ్చితంగా సహాయం చేయాలి. కొన్ని సార్లు ప్రత్యక్షంగా లేదా కొన్ని సార్లు పరోక్షంగా సహాయం చేయాలి. ఇలా చేస్తుంటే రిజల్ట్ దానంతటే అదే వస్తుంది.

ఇక రీసెంట్ గా ప్రభాస్‌ సినిమా యూజ్‌ చేసిన బుజ్జి కారు గుర్తుందా. దీన్ని రీసెంట్‌గా రైడ్‌ చేశారు నాగచైతన్య. కల్కి 2898ఏడీ టీమ్‌ పడిన కష్టాన్ని ప్రశంసించారు. ఇలా చైతూ మాట్లాడారంటే ప్రభాస్ సినిమాను ఆయన ప్రమోట్ చేసినట్టే. మరి చైతూ ఇండైరెక్ట్ గా ప్రభాస్ కి హెల్ప్ చేశారు. అదే విధంగా ప్రభాస్ కూడా మహేష్ బాబుకు హెల్ప్ చేశారు. అది కూడా ఇండైరెక్ట్ గా అన్నమాట.

అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ తో లింకు పెట్టి ఈ విషయం మాట్లాడుతున్నారు నెటిజన్లు. శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌లో దేవదత్త నాగే హనుమంతుడిగా కనిపించారు. ఈయన ప్రస్తుతం రాజమౌళి – మహేష్‌ మూవీకి ఒప్పుకున్నారట. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను రివీల్‌ చేయకపోయినా రాజమౌళితో తీసుకున్న పిక్‌ వైరల్‌ గా మారింది. మరోవైపు మహేష్ కి విలన్‌గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఒకే అయ్యారు అని టాక్.

ఈ ఇద్దరు కలిసి సలార్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్వరలోనే సలార్‌2 సెట్స్ లోనూ కలవడానికి సిద్దం అవుతున్నారు. సో… ఇలా ప్రభాస్‌ సినిమాల్లో నటించిన మెయిన్‌ ఆర్టిస్టులు, మహేష్‌ మూవీ అవకాశాలను పొందడం విశేషం. ఇలాంటి వార్తలు వింటుంటే…. మహేష్‌ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు యమా స్పీడ్‌గా జరుగుతున్నాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.