https://oktelugu.com/

తెలుగు రాష్ర్టాలపై ప్రధాని దృష్టి?

బీజేపీ దక్షిణాదిలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇదే అదనుగా తెలుగు రాష్ర్టాలపై ప్రభావం చూపేలా పావులు కదుపుతోంది. ఎలాగూ కేసీఆర్, జగన్ ప్రధానితో మంచి సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో పార్టీ కొత్త ఆశలే పెట్టుకుంది. ఎటొచ్చి కాంగ్రెస్ అందరికీ శత్రువే. దీంతో తెలుగు రాష్ర్టాల్లో బీజేపీని ఎలాగైనా పటిష్ట పరచాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సైతం ఖరారుకు సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాదిలో సైతం తమ వాణి […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2021 11:17 am
    Follow us on

    PM Modi

    బీజేపీ దక్షిణాదిలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇదే అదనుగా తెలుగు రాష్ర్టాలపై ప్రభావం చూపేలా పావులు కదుపుతోంది. ఎలాగూ కేసీఆర్, జగన్ ప్రధానితో మంచి సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో పార్టీ కొత్త ఆశలే పెట్టుకుంది. ఎటొచ్చి కాంగ్రెస్ అందరికీ శత్రువే. దీంతో తెలుగు రాష్ర్టాల్లో బీజేపీని ఎలాగైనా పటిష్ట పరచాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సైతం ఖరారుకు సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాదిలో సైతం తమ వాణి వినిపించేందుకు పట్టు కోసం పాకులాడుతున్నారు.

    ముగ్గురికి శత్రువు ఒక్కరే అయిపోయారు. కేసీఆర్, జగన్, మోదీకి అందరికీ ప్రధానమైన శత్రువు కాంగ్రెస్సే. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను దెబ్బకొట్టి అధికారం హస్తగతం చేసుకోవాలని అందరు విశ్వసిస్తున్నారు. తమ పబ్బం గడుపుకోవడానికి ఇప్పటి నుంచే పాచికలు వేస్తున్నారు. ఉభయ రాష్ర్టాల్లో ఇటు కేసీఆర్, అటు జగన్ తో సఖ్యత ఏర్పడేలా చూసుకుంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీతో నష్టాలే ఎక్కువగా ఉంటాయని చెబుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.

    కేంద్రంలో బీజేపీ ఉంటేనే లాభం అనే ఆలోచన తెలుగు రాష్ర్టాల సీఎంలలో ఏర్పడింది. దీంతో వారు తెలుగు రాష్ర్టాలపై కాస్త సానుకూలంగానే ఉంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే కొంప కొల్లేరే అనే ధోరణిలో తెలుగు రాష్ర్టాల సీఎంలు ఆలోచిస్తున్నారు. అందుకే వారు బీజేపీకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    తెలుగు రాష్ర్టాల సీఎంలు ప్రధానితో బాగానే టచ్ లో ఉంటున్నారు. కరోనా వేళ మోదీ జగన్ తో మాట్లాడినా, కేసీఆర్ తో చర్చించినా ఇద్దరూ సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం కూడ సాయం బాగానే చేస్తోంది. 2024లో కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి రానీయకుండా చేసేందుకు తెలుగు రాష్ర్టా సీఎంలు బీజేపీకి మద్దతు ఇస్తారనే విషయం తెలిసిపోతోంది. దీంతో ఈ సమయంలో కేంద్రం తెలుగు రాష్ర్టాలపై తెలివితో వ్యవహరిస్తుందని చెబుతున్నారు.