
అతిలోక సుందరి, అలనాటి అందాల తార అంటూ ‘శ్రీదేవి’ గురించి ఎన్ని చెప్పుకున్నా.. ఆమె అందం గురించి పూర్తిగా వర్ణించలేం. ప్రస్తుతం శ్రీదేవి మన మధ్య లేకపోయినా ఆమె వారసత్వం మాత్రం ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడబోతోంది. ఇప్పటికే శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాలతో బిజీ అవ్వడానికి కసరత్తు చేస్తోంది.
ఇటివలే చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ను వెండితెరకి పరిచయం చేయాలని బోనీ కపూర్ ఆల్ రెడీ సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే టాలీవుడ్ లో ఖుషీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో.. వాస్తవం ఎంత ఉందని పక్కన పడితే.. బోణి కపూర్ చిన్న కూతురును కూడా తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖుషీ కపూర్ యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటుందట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఓ సినిమాలో ఖుషీ కపూర్ నటించనుంది. ‘శ్రీదేవి’కి ఒక చిరకాల కోరిక ఉంది. తన చిన్న కూతురిని పెద్ద హీరోయిన్ ను చేయాలని శ్రీదేవి ఎప్పుడు ఆశ పడుతూ ఉండేది. ఎలాగూ బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది జాన్వీ కపూర్.
జాన్వీ బాటలోనే ఖుషీ కపూర్ కూడా ఎంట్రీకి సిద్ధమైంది. అయితే ఈ యంగ్ బ్యూటీకి కొంచెం అందచందాలు తక్కువ కావడంతో, సర్జరీలు కూడా చేయించుకుని మరీ మొత్తానికి అందాన్ని పెంచుకుని హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మరి అక్క లాగే అరంగేట్రంలోనే ఖుషి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.