Time Magazine: ప్రపంచ వ్యాప్తంగా టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏడాది వంద మంది ప్రతిభావంతుల జాబితా ప్రకటిస్తుంది. అత్యంత శక్తిమంతులు, ప్రభావశీలురు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జాబాతా విడుదల చేస్తుంది. ఇందులో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న జనాభాలో నుంచి 100 మందిని ఎంపి చేస్తారు. అందులో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. అలాంటి జాబితాలో మన దేశం నుంచి ముగ్గురు స్థానం దక్కించుకున్నారు. ప్రధాని మోడీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీరమ్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆధార్ పూనావాలాకు అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హ్యారీస్ కూడా ఉండడం గమనార్హం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, డ్యూక్ అండ్ డచెస్ ఆప్ సస్పెక్స్ ప్రిన్స్ హ్యారీ మెఘాన్ చోటు దక్కించుకున్నారు. కానీ తాలిబన్ నాయకుడు, మత చాందసవాది అయిన తాలిబన్ ప్రభుత్వ ఉప ప్రధానమంత్రి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కు చోటు దక్కడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాలిబన్ నాయకుడి పేరు టైమ్ మ్యాగజైన్ లో కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అఫ్గనిస్తాన్ ఆక్రమణలో ఎలాంటి రక్తపాతం లేకుండా శాంతియుతంగా నిర్వహించడంతో బరాదర్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక బలగాల ఉపసంహరణలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా చేసినందుకే అతడి పేరు ప్రచురించినట్లు తెలుస్తోంది. పైగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్ల సరసనే బరాదర్ పేరు చేర్చడం తెలిసిందే.
తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బరాదర్ చేసిన పాత్ర కీలకమని గర్తించింది. రక్తపాత రహితంగా పాలన కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలోనే బరాదర్ కు ఇంతటి ఘనత దక్కినట్టు సమాచారం. టైమ్ మ్యాగజైన్ లో ఆయన పేరు ప్రచురించడంపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదుల స్వర్గధామంగా మారే ప్రమాదం ఉన్న అఫ్గాన్ కు ఇంతటి ప్రాధాన్యం ఎందుకని కొందరి ప్రశ్నిస్తున్నారు.
బరాదర్, హడ్కానీ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్య అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే బరాదర్, హడ్కానీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలియజేసేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తానికి ఓ తాలిబన్ నాయకుడు టైమ్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది.