
సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్ కేసర్ మార్గంలో రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. నగర నడిబొడ్డులోని సైదాబాద్ -సింగరేణి కాలనీ.. ఇక్కడి నుంచి రాజు తప్పంచుకుని ఉప్పల్ వెళ్లాడు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై డెబ్ బాడీ పడి ఉందనే సమాచారంతో స్పాట్ కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న టాటూను చూసి అతనేనని కన్ ఫామ్ చేసుకున్నారు. రాజును పట్టుకునేందుకు పోలీసులు వేర్వేరు బృందాలుగా గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.