Modi : కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ.. సీరియస్ హెచ్చరిక

Modi KCR : మునుగోడులో తలపడ్డ బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు మోడీ రాకతో మరోసారి అదే పనిచేశాయి. ఇన్నాళ్లు కేసీఆర్ ను డైరెక్టుగా తిట్టని మోడీ ఇప్పుడా పనిచేశాడు. పేరు ఎత్తకుండా సంచలన కామెంట్స్ చేశాడు. ఏపీ నుంచి బేగంపేట విమానాశ్రయంలో దిగిన మోడీ అక్కడ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా కేసీఆర్ మైనస్ లనే ఎత్తి చూపి ఎండగట్టారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదన్నారు. పేదలను దోచుకునే […]

Written By: NARESH, Updated On : November 12, 2022 2:43 pm
Follow us on

Modi KCR : మునుగోడులో తలపడ్డ బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు మోడీ రాకతో మరోసారి అదే పనిచేశాయి. ఇన్నాళ్లు కేసీఆర్ ను డైరెక్టుగా తిట్టని మోడీ ఇప్పుడా పనిచేశాడు. పేరు ఎత్తకుండా సంచలన కామెంట్స్ చేశాడు. ఏపీ నుంచి బేగంపేట విమానాశ్రయంలో దిగిన మోడీ అక్కడ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా కేసీఆర్ మైనస్ లనే ఎత్తి చూపి ఎండగట్టారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదన్నారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఆయన్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ కమలం వికసిస్తుందని.. మునుగోడులోనూ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని.. ఈ ఒక్క సీటు కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం కదిలివచ్చిందంటే అదంతా బీజేపీ పోరాటం వల్లేనని మోడీ కొనియాడారు. తెలంగాణలో జరిగే ప్రతీ ఉప ఎన్నిక బీజేపీ బలాన్ని నిరూపిస్తోందని.. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చీటకల్లో ఉన్న తెలంగాణలో సూర్యోదయానికి సమయం దగ్గరపడిందని టీఆర్ఎస్ సర్కార్ పతనం కావడం ఖాయమని హెచ్చరించారు.

1984లో బీజేపీకి దేశవ్యాప్తంగా కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు హన్మకొండ నుంచి జంగారెడ్డి గెలిచారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలి. అవినీతి, కుటుంబ పాలన దేశానికి ప్రథమ శత్రువులు అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేశాడు మోడీ. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో అధికారంలోకి వచ్చామని.. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని మోడీ సవాల్ చేశారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇక తిరుగుండదు అంటూ భరోసానిచ్చారు.

కేసీఆర్ మూఢనమ్మకాలను మోడీ టార్గెట్ చేశారు. ఐటీలో ముందున్న హైదరాబాద్ లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని.. పాలకులు వాస్తు పేరుతో ఒక్కటే చోట ఉండి? ఎక్కడ కూర్చోవాలి? ఎంతమందిని మంత్రులుగా ఉంచాలి.? ఎవరికి సీటు ఇవ్వాలంటూ మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారని మోడీ విమర్శించారు. నన్ను, బీజేపీని ఎంత తిట్టినా కార్యకర్తలు ఆందోళన చెందవద్దని.. నేను మూడు కేజీల తిట్లు తింటానని.. నాకు పోషకాలుగా అవే మారుతున్నాయన్నారు.

ఇలా ఎన్నడూ లేనంతగా కేసీఆర్ సర్కార్ పై మోడీ డైరెక్ట్ అటాక్ చేశాడు. మొన్నటి ఫాంహౌస్ కొనుగోళ్లలో కేసీఆర్ ఎలాగైతే మోడీ, షాలను టార్గెట్ చేశారో ఇప్పుడు మోడీ కూడా అదేవిధంగా కేసీఆర్ పాలనపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది.