https://oktelugu.com/

కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని హిందువులంతా కళ్లు ఆర్పకుండా చూసిన అయోధ్య రామాలయ భూమిపూజపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు మోడీనే కాదు.. ఇటు కేసీఆర్ ను కూడా సెక్యులరిజం లేని నేతలుగా ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ మిత్రుడే అయినా సచివాలయంలో మసీదు కూలగొట్టినందుకు కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. ఈ రెండు విమర్శల్లో తమ వర్గానికి చెందిన మత ప్రార్థనల భవనాలు కూల్చివేయడమే అసద్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. Also Read: ఉద్యమం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2020 / 08:39 PM IST
    Follow us on


    ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని హిందువులంతా కళ్లు ఆర్పకుండా చూసిన అయోధ్య రామాలయ భూమిపూజపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు మోడీనే కాదు.. ఇటు కేసీఆర్ ను కూడా సెక్యులరిజం లేని నేతలుగా ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ మిత్రుడే అయినా సచివాలయంలో మసీదు కూలగొట్టినందుకు కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. ఈ రెండు విమర్శల్లో తమ వర్గానికి చెందిన మత ప్రార్థనల భవనాలు కూల్చివేయడమే అసద్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.

    Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

    ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వేళ మోడీని టార్గెట్ చేశారు. పలు లాజిక్ ప్రశ్నలు సంధించారు. భారతదేశానికి ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ఆయన దేశంలోని అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని అసద్ సంధించిన ప్రశ్న తూటాలానే పేలింది. రాజ్యాంగ ప్రమాణాన్ని మోడీ ఉల్లంఘించాడని అసద్ ఆరోపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయిందని.. లౌకికవాదాన్ని మోడీ అవమానపరిచాడని ఆయన మాటలను ఖండిస్తున్నట్టు అసద్ విమర్శించారు.

    అసద్ అన్న మాటల్లో నిజంగానే లాజిక్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూ వాదాన్ని ఎవరూ వ్యతిరేకించరు. దేశంలో మెజార్టీ వాళ్లే కావడం కాదనరు. కానీ లౌకిక భారత దేశంలో లౌకికత్వం రాజ్యాంగంలో దేశం ముఖ్య భాగం.. దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయోధ్యలో కనిపించడం నిజంగానే లౌకికవాదులకు ఆగ్రహం తెప్పిస్తోంది. హిందుత్వ శక్తులను కొత్త భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని అసద్ ఆరోపించడంలో నిజంగానే మైనార్టీల్లో అభద్రతా భావాన్ని పెంచుతోందంటున్నారు.

    అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

    Also Read: నదీజలాల కోసం కేసీఆర్, జగన్ ఫైట్

    ఇక తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కూల్చివేసిన మసీదును అదే ప్రాంతంలో ప్రభుత్వమే బేషరుతుగా పునర్ నిర్మించాలని అసద్ డిమాండ్ చేశారు. ఖచ్చితమైన తేది చెప్పాలని కేసీఆర్ ను కలిసి కోరతానన్నారు.

    ఇలా ఒకే టైంలో తమ వర్గం విషయంలో జరిగిన అన్యాయంపై అసద్ గళమెత్తారు. విశేషం ఏంటంటే.. అక్కడా.. ఇక్కడా రెండూ కూల్చివేసి కడుతున్నావే.. సామీప్యాలున్న ఈ రెండు సమస్యలపై అసద్ తన వర్గం తరుఫున గళం వినిపించడం విశేషం.