https://oktelugu.com/

ఫాలో ఫాలో.. రకుల్ ఇన్‌స్టా‌ ఫాలోవర్లు కోటిన్నర

రకుల్‌ ప్రీత్‌ సింగ్. కొన్నాళ్లు పాటు టాలీవుడ్‌ను ఊపు ఊపిన హీరోయిన్‌.స్టార్ హీరోలతో పెద్ద సినిమాల్లో నటించి యమ స్పీడులో దూసుకెళ్లింది. మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిందామె. తెలుగులో తన ఫస్ట్‌ మూవీ ‘ కెరటం’. ఈ చిన్న చిత్రం విడుదలైన సంగతి, అందులో రకుల్‌ హీరోయిన్‌ అన్న విషయమే చాలా మందికి తెలియదు. కానీ, తన రెండో సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఘన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 08:48 PM IST
    Follow us on


    రకుల్‌ ప్రీత్‌ సింగ్. కొన్నాళ్లు పాటు టాలీవుడ్‌ను ఊపు ఊపిన హీరోయిన్‌.స్టార్ హీరోలతో పెద్ద సినిమాల్లో నటించి యమ స్పీడులో దూసుకెళ్లింది. మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిందామె. తెలుగులో తన ఫస్ట్‌ మూవీ ‘ కెరటం’. ఈ చిన్న చిత్రం విడుదలైన సంగతి, అందులో రకుల్‌ హీరోయిన్‌ అన్న విషయమే చాలా మందికి తెలియదు. కానీ, తన రెండో సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఘన విజయం సాధించడంతో రకుల్‌ కెరీర్ టర్న్‌ అయింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు రావడంతో ఫుల్‌ బిజీగా మారింది. కన్నడ, హిందీ చిత్రాలను వదులుకొని మరీ టాలీవుడ్‌లో సినిమాలు చేసింది. చాకచక్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. రామ్‌ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేశ్‌ బాబు ఇలా స్టార్లందరితో తెర పంచుకోవంతో రకుల్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది.

    Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

    సక్సెస్‌ రేట్‌ ఎక్కువగానే ఉండడంతో తన రేటు కూడా పెంచేసింది. అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకునే స్థాయికి వెళ్లిన ఆమె వచ్చిన డబ్బులతో హైదరాబాద్‌లోనే జిమ్‌ వ్యాపారంలో ఇన్వెస్ట్‌ చేసింది. కానీ, వరుసగా రెండు ఫ్లాప్స్‌ పడడంతో అంతా రివర్సైంది. మహేశ్‌ బాబుతో చేసిన స్పైడర్, నాగార్జున సరసన నటించిన మన్మధుడు-2 డిజాస్టర్లు కావడంతో టాలీవుడ్‌లో రకుల్‌ కెరీర్ డీలా పడింది. అంతే ఆమె వెంటనే ముంబై చెక్కేసింది. ఒకవైపు హిందీ, మరోవైపు తమిళ్‌ చిత్రాలు చేసిందామె. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అయితే, టాలీవుడ్‌కు దూరమైనా అభిమానులకు మాత్రం ఆమె దూరం కాలేదు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్‌ ఫ్యాన్స్‌కు తరచూ టచ్‌లోకి వస్తోంది. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెట్టే ఈ అందగత్తె జిమ్‌ సూట్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ అందాల ట్రీట్‌ ఇస్తూ ఉంటోంది. దాంతో, సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్లూ క్రమంగా పెరుగుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ చిత్రాలు చేస్తుండడంతో అక్కడి ఫ్యాన్స్‌ కూడా ఆమెను సోషల్‌ మీడియాలో అనుసరిస్తున్నారు.

    Also Read: హ్యాపీగాపెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు !

    నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఐ వన్న ఫాలో ఫాలో ఫాలో యూ అని పాట పాడినట్టుగా రకుల్‌ను ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. దాంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లు అంటే అక్షరాల కోటిన్నర దాటింది. 15 మిలియన్స్‌ ఫాలోవర్స్ ‌ క్లబ్‌లో చేరడంతో రకుల్‌ తెగ సంబరపడిపోతోంది. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ‘15 మిలియన్ల బలమైన బంధం. నా పని గురించి, నైపుణ్యాల గురించి, సోషల్‌ మీడియా గురించి పెద్దగా అవగాహన లేని చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించా. కానీ, మీరంతా నాకు అండగా ఉన్నారు. నాపై ఎంతో ప్రేమ కురిపించారు. అందుకే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అన్నింటా నేను పర్ఫెక్ట్‌ కాకపోవచ్చు కానీ బాగా కష్టపడుతూ మిమ్మల్ని ఎంటర్ చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నా. నా ఇన్‌స్టా ఫ్యాన్స్‌ అందరికీ పెద్ద హగ్‌ ఇస్తున్నా. వాళ్లు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. లవ్‌ యు ఆల్‌’ అని రకుల్‌ పేర్కొంది.