https://oktelugu.com/

చంద్రబాబు ఎప్పుడైనా సవాల్ ను స్వీకరించారా?

అమరావతి విషయంలో అధికార పక్షం ప్రజలను మోసం చేసిందని, అమరావతే రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మోసం చేసిందని విపక్ష నేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అధికార పక్షానికి సవాల్ విసిరారు. 48 గంటల్లో సవాల్ ను స్వీకరించాలని లేకపోతే.. తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. అధికార పక్షంలో ఉన్న వారిని ఏదైనా సంఘటన జరిగినప్పడు రాజీనామా చేయాలని డిమాండ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 08:26 PM IST
    Follow us on


    అమరావతి విషయంలో అధికార పక్షం ప్రజలను మోసం చేసిందని, అమరావతే రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మోసం చేసిందని విపక్ష నేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అధికార పక్షానికి సవాల్ విసిరారు. 48 గంటల్లో సవాల్ ను స్వీకరించాలని లేకపోతే.. తాను చేయాల్సింది చేస్తానని చెప్పారు. అధికార పక్షంలో ఉన్న వారిని ఏదైనా సంఘటన జరిగినప్పడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం పరిపాఠి. అధికార పక్షానికి రాజీనామా సవాల్ విసిరి 48 గంటలు సమయం ఇచ్చిన చంద్రబాబు తాను సిఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు ఇదే విధంగా సవాల్ చేసినప్పుడు ఆ సవాల్ ను స్వీకరించిన సందర్భాలు ఎన్నడూ లేవు.

    Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

    ప్రత్యేక హోదా విషయంలో మాటమార్చిన చంద్రబాబును రాజీనామా చేయాలని జనసేన అధినేత 2018లో డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో పవన్ ఈ డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో మద్దతు ఇస్తేనే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అనంతరం ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చి ప్రత్యేక ప్యాకేజికి ముందుకు వెళ్లడంతో పవన్ ఈ సవాల్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సవాల్ కు స్పందించలేదు.

    అదేవిధంగా చంద్రబాబు సిఎంగా ఉండగా 2017 నవంబరు 13న కృష్ణానదిలో విజయవాడ సమీపంలోని ఫెర్రీలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తూ పడవ ప్రమాదానికి సిఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంలో పనులు కేటాయించాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వానికి హై కోర్టు తీర్పు మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై చంద్రబాబు రాజీనామా చేయాలని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి డిమాండ్ చేశారు.

    Also Read: నదీజలాల కోసం కేసీఆర్, జగన్ ఫైట్

    ఇక రాజధాని భూసమీకరణ, బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ, పోలవరం పునరావాసం, ఎన్నికల్లో హామీలు అమలు చేయని అంశాల్లో వామపక్ష పార్టీల నాయకులు అనేక సార్లు సిఎం చంద్రబాబుకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

    తాను అధికారంలో ఉండగా ఎన్నో పర్యాయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులు రాజీనామా సవాల్ విసిరినప్పుడు స్వీకరించని చంద్రబాబు నాయుడు ఇప్పడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయాలని సవాల్ విసరడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు అధికారం కోల్పోవడంతో ఈ రకంగానైనా అధికార పక్షాన్ని దెబ్బతీయాలనే ఆశతో ఉన్నారనే వాదనలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. సవాల్ ను అధికార పక్షం స్వీకరించదని చంద్రబాబుకు తెలుసు… తాను చేయాల్సింది చేస్తానని చెప్పిన బాబు ఏం చేయబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.