PM Modi Tweets: మీకు గుర్తుందా.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మాల్దీవుల ప్రభుత్వం మనమీద అడ్డగోలుగా మాట్లాడింది. మనకు శుభ్రత తెలియదని.. స్వచ్ఛంగా ఉండడం తెలియదని.. మురికిగా ఉంటామని అడ్డమైన కూతలు కూసింది. అంతేకాదు పరిశుభ్రతలో మీరు మాతో పోటీ పడతారా అంటూ సవాల్ విసిరింది. మాల్దీవులు చేసిన ఆరోపణలకు భారత్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది రోజులకు ఒక కుర్చీ వేసుకొని లక్షద్వీప్లో కూర్చున్నాడు. దెబ్బకు సినిమా అర్థమైంది. మాల్దీవులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత ఆర్థిక మూలాలు స్తంభించడం మొదలైంది. దీంతో మహాప్రభు అంటూ మోడీ శరణు వేడింది మాల్దీవులు. ఇక జన్మలో మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడమంటూ కాళ్ళ మీద పడినంత పని చేసింది.
ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలానే మారింది. వింటుంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఎందుకంటే అమెరికా ప్రపంచ పెద్దన్నగా ఫోజు కొడుతుంది గాని.. మిగతా దేశాలు వ్యతిరేకిస్తే అతిపెద్దగా ప్రభావం చూపించలేదు. ఒకప్పుడు అమెరికా ప్రపంచం మీద పెత్తనం సాగించింది. ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్ లొంగడం లేదు. రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఉక్రెయిన్ పై దాడి ఆపడం లేదు. చైనాను ఏదో చేయాలనుకున్నప్పటికీ.. సాధ్యం కావడం లేదు. పైగా రివర్స్లో చైనా సైబర్ ఎటాక్ మొదలు పెడుతోంది. ఇక ఇండియా మీద గంగ వెర్రులు ఎత్తుతున్నప్పటికీ.. మోడీ నిశ్శబ్దాన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. అమెరికా మీద ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇదే సమయంలో చైనా తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని.. ట్రేడ్ బిజినెస్ కొనసాగించాలని ఇటీవల నిర్ణయించి.. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నాడు. బ్రిక్స్ సమావేశంలోనూ అదే దూకుడు కొనసాగించాడు మోడీ. ఒక రకంగా ప్రపంచ బ్యాంకు.. ఐక్యరాజ్యసమితికి దీటుగా బ్రిక్స్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు మోడీ.
ట్రంప్ ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ.. తాను విధించిన సుంకాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. భారత తనకు నమ్మకమైన దేశమని.. ఇటీవల జరిగిన పరిణామాలు తనను ఇబ్బంది గురిచేస్తున్నాయని కొంగ జపం లాగా మాట్లాడుతున్నాడు. దీనిపై మోడీ కూడా అదే స్థాయిలో స్పందించాడు. ఎటువంటి విమర్శలు చేయకుండానే.. మీతో వ్యాపారం మాకు అవసరమని.. మీతో సంబంధం మాకు అత్యంత ముఖ్యమని ఉభయకుశలోపరి మాదిరిగా ట్వీట్ చేశాడు. ఇది ఒక రకంగా ట్రంప్ కు కోపం తెప్పించింది. అయినప్పటికీ ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో మన ప్రత్యర్థి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు.. వాటికి మనం బదులు చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మోడీ కూడా అదే అనుసరిస్తున్నాడు కాబట్టి ట్రంప్ కు సినిమా అర్థమైంది.
రష్యా దగ్గరనుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆగడం లేదు. చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం దూకుడుగా వెళ్తోంది. బ్రెజిల్ తో అనేక రకాలైన ఒప్పందాలు కుదిరాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలో దాదాపు 50 కి పైగా దేశాలతో భారత్ ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రెడీ అయింది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ను ఏహే పో అంటూ ఇండియా లైట్ తీసుకుంది. ట్రంప్ ఊహించినట్టుగా జరగకపోవడంతో అమెరికా ఆర్థిక పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూలంగా అమెరికా నిపుణులకు అర్థమైంది ఏంటయ్యా అంటే.. ఇది ఒకప్పటి భారత్ కాదు. అమెరికా కళ్ళు ఎర్ర చేస్తే భయపడిపోయే భారత్ అంతకంటే కాదు.