Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కీలక ఎన్డీఏ నేతలంతా వారణాసికి తరలిరాగా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మూడోసారి పోటీ..
ఇదిలా ఉండగా మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. 2014, 2019లో ఇక్కడి నుంచే గెలిచారు. ప్రస్తుతం కూడా మరోమారు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముంద మోదీ గంగా నదదిలో పూజలు చేశారు. తర్వాత కాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరలి వచ్చిన నేతలు..
మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్డీ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఏపీ నుంచి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జీతీయ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను వ్యక్తగతంగా మోదీ అభిమానినని తెలిపారు. ఆయన అంటే తనక అపారమైన గౌరవమిన పేర్కొన్నారు. 2014లో తాము కూఏటమిగా నిలబడ్డామని, ప్రధాని మోదీ మూడోసారి కూడా ప్రధాని కావడం ఖాయమని వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్నారు. వారణాసి ఒక పవిత్ర స్థలమని, మోదీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.