Yadamma Special Dishes For PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నగరంలో జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం శోభను సంతరించుకుంది. బీజేపీ నేతల్లో జోష్ పెరుగుతోంది. నిన్న ప్రధానితో జరిపిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో అందరిలో సంతోషం వ్యక్తమవుతోంది. నగరంలో బీజేపీ నేతల సందడి కొనసాగుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరినట్లు అయింది. ప్రధాని మోడీ తమ ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించి టీఆర్ఎస్ గురించి పట్టించుకోకపోవడంతో వారికి మింగుడుపడటం లేదు. బీజేపీ వైఖరి అంతుచిక్కడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమావేశాలకు కేంద్రం నుంచి పలువురు నేతలు రావడంతో వారికి వడ్డించే వంటకాల విషయంలో కూడా ప్రత్యేక శ్ర్దద్ధ తీసుకుంటున్నారు. ప్రత్యేకమైన మెను తయారు చేశారు. వంటల్లో మాంసాహారంతో పాటు శాఖాహారాల్లో పలు రకాల వెరైటీలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మ్మతి ఇరానీ, పీయూష్ గోయల్ తదితరులు హాజరైన సందర్భంలో నేతలు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: Modi vs KCR: కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకున్న మోడీ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం గుడాటిపల్లికి చెందిన యాదమ్మ నేతలకు వంటలు సిద్ధం చేస్తోంది. ప్రధానమంత్రికే వండి పెట్టడం తన అదృష్టంగా భావిస్తున్తున్నానని హర్షం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలకు కావాల్సిన వంటలన్ని వండి పెట్టడంతో వారు ఇష్టంగా తింటున్నారు. ఏది కావాలంటే అది చేసిపెడుతూ యాదమ్మ తన వంటల రుచులను ఆస్వాదించేలా చేస్తోంది. మెనూ ప్రకారం వారికి వండిపెడుతూ వారి ఆకలి తీరుస్తోంది. అతిథులు కూడా యమ్మీయమ్మీగా ఆరగిస్తూ వంటలు బాగున్నాయని కితాబిస్తున్నారు.

వంట్లో స్వీట్లు, హాట్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఎవరికి ఏది కావాలన్నా దాన్ని వండి పెడుతూ యాదమ్మ తన చేతి రుచులను చూపిస్తోంది. దీంతో నేతలు ఇష్టంగా తింటున్నారు. వంటకాల్లో పలు రకాల వెరైటీలు తయారు చేస్తోంది. టమాట, బెండకాయ, వంకాయ, పప్పు, పాయసం, స్వీట్లతో పాటు పలు రకాల తినుబండారాలు సిద్ధం చేస్తోంది. అన్నింటిని ఆరగిస్తూ భలే రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో తెలంగాణ వంటలను రుచి చూస్తూ మనసారా ఆస్వాదిస్తున్నారు.
యాదమ్మ వంటలను చూసి ప్రదాని మోడీ ప్రశంసించారు. వంటకాలు బాగున్నాయని కితాబిచ్చారు. యాదమ్మ వండిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. మొత్తానికి మన వంటలకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అందరు సంబరపడుతున్నారు.
Also Read:Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు
[…] […]
[…] […]