Homeఎంటర్టైన్మెంట్Upendra-Mahesh Babu: ఉపేంద్ర మహేష్ తో అందుకే ఒప్పుకున్నాడు !

Upendra-Mahesh Babu: ఉపేంద్ర మహేష్ తో అందుకే ఒప్పుకున్నాడు !

Upendra-Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్ర మహేష్ కి తండ్రి పాత్ర అని తెలుస్తోంది. అయితే.. ఈ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నాడు. ఉపేంద్ర కన్నడలో సూపర్ స్టార్. అలాంటి హీరో.. అప్పుడే మహేష్ కి తండ్రిగా నటించడానికి ఎలా ఒప్పుకున్నాడు ? అని అందరూ డౌట్ పడుతున్నారు.

Upendra

అయితే, ఉపేంద్ర, మహేష్ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. మహేష్ కి లైవ్ లో ఉపేంద్ర తండ్రిగా నటించడం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే ఉపేంద్ర తండ్రిగా కనిపిస్తాడు. అంటే.. మహేష్ చిన్నప్పటి పాత్రకు ఉపేంద్ర తండ్రిగా నటిస్తున్నాడు. మరి, త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. ఉపేంద్ర కి పాత్ర బాగుంటుందేమో చూడాలి.

Upendra-Mahesh Babu
Upendra, Mahesh Babu

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఆగస్టు నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు.

పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు. అనిల్ కపూర్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట.

Upendra-Mahesh Babu
Mahesh Trivikram

ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్‌ అయిపోయింది. ఎలాగూ మహేష్‌ రెమ్యునరేషన్‌ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్‌ తో త్రివిక్రమ్‌ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు. ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper