గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపే అందరి అనుమానాలు కేంద్రీకృతం అవుతున్నాయి. ఆ ప్లాంట్ విస్తరణకు అవసరమైన భద్రత అప్రమాణాలు లేవని గత తెలుగు దేశం ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, వై సి పి ప్రభుత్వం ఏర్పడగానే అనుమతి లభించడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతి వచ్చేటట్లు చేయడంలో వైసిపి కీలక నేత విజయసాయి రెడ్డి ప్రధాన సూత్రధారి అనే […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 12:55 pm
Follow us on


విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపే అందరి అనుమానాలు కేంద్రీకృతం అవుతున్నాయి. ఆ ప్లాంట్ విస్తరణకు అవసరమైన భద్రత అప్రమాణాలు లేవని గత తెలుగు దేశం ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే, వై సి పి ప్రభుత్వం ఏర్పడగానే అనుమతి లభించడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.

ఆ ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతి వచ్చేటట్లు చేయడంలో వైసిపి కీలక నేత విజయసాయి రెడ్డి ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. అందుకనే ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే విజయసాయి రెడ్డిని తనతో తీసుకు వెళ్లలేదని పలువురు భావిస్తున్నారు.

గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!

లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే రాష్ట్ర పొల్యూషన్ బోర్డు ఎన్ ఓ సి ఇవ్వడం వెనుక కూడా ఆయనే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు చూడక పోవడంతోనే ప్రస్తుత విపత్తు జరిగిన్నట్లు స్పష్టం అవుతున్నది.

విశాఖ వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి సహితం ఈ విపత్తుకు కారణమైన కంపెనీపై కఠిన చర్య తీసుకుంటామని ఒక్క మాట అనకపోవడం పలువురి దృష్టిని ఆకట్టుకొంటున్నది. పైగా, ఆయన విశాఖ చేరుకోగానే బాధితులను పరామర్శించడానికి ముందే కంపెనీ ప్రతినిధులను కలుసుకోవడం పలువురి దృష్టిని ఆకట్టుకొంటున్నది.

అదే కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. పైగా ఈ విపత్తుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్కొన్న సెక్షన్లు సహితం తీవ్రంగా లేవని చెబుతున్నారు. ఆ కంపెనీ లాక్ డౌన్ లో పనిచేసే అనుమతులు ఇవ్వడం వెనుక ఎవ్వరు ఉన్నారో వెల్లడైతే గాని మొత్తం కథ వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు.

కమీషన్ల కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ

ముందుగా బాధిత కుటుంబాలకు జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించడం కూడా విమర్శలకు దారితీస్తుంది. ఆ కంపెనీ ప్రయోజనాలు కాపాడటానికే ఆ విధంగా చేసి ఉంటారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రమాదకరమైన పేలుళ్లకు అవకాశం గల ప్రతి కంపెనీ లయబిలిటీ భీమా చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం ఇటువంటి ప్రమాదాలలో మృతి చెందిన వారికి రూ 5 కోట్ల వరకు పరిహారం చెల్లింపవలసి ఉంటుంది.

కొద్దీ స్థాయి నష్టం జరిగితే 1 నుండి 2 కోట్ల రూపాయలు, ఆస్థి నష్టం పూర్తిగా భర్తీ చేయడం, మొత్తం వైద్య ఖర్చులు పెట్టుకోవడం చేయవలసి ఉంటుంది. ఆ విధమైన భరోసా ముఖ్యమంత్రి మాటలలో కనిపించడం లేదు. కంపెనీ ప్రయోజనాల పట్ల రాష్త్ర ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు భావించ వలసి ఉంటుంది.

ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

తగు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిన్నట్లు పలువురు భావిస్తున్నారు. చివరకు ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ సైరన్ ఎందుకు మోగలేదని ముఖ్యమంత్రి సహితం విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో గోదావరి బోట్ ప్రమాదంలో బాధితులకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయమే ఇప్పటి వరకు పూర్తిగా అందలేదని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.

ఈ సంఘటనలో మరణాలు తక్కువగా ఉన్నా గ్యాస్‌ లీకేజితో అస్వస్ధతకు గురైన వారు రెండు వేల మంది వరకూ ఉన్నారు. కరోనా బాధితులకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ రావడానికి.. వ్యాధి నిరోధక శక్తి క్షీణించడానికి ఈ గ్యాస్‌ వల్ల ఆస్కారం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

ఇలా ఉండగా, అసలు పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ కంపెనీ పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా, గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతుల పరిధికి మించి ఈ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించినట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవీ జరుగుతున్నట్లు లేదు.