ఆర్ఎస్ఎస్ ను కూల్ చేసే పనిలో మోదీ, అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల భవిష్యత్తుకు ఎదురుగాలి వీస్తోంది. పార్టీ ఘోర పరాభవానికి వారినే నిందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశానికి గుండె కాయ లాంటి ఉత్తర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక స్థానాల్లో సైతం ముందంజ వేయలేకపోయింది. దీనికి కారణం మోదీ, అమిత్ షా, ఆదిత్య నాథ్ లే అని చెబుతున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీని గట్టెక్కించే పనిలో […]

Written By: Srinivas, Updated On : May 27, 2021 9:27 am
Follow us on

ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల భవిష్యత్తుకు ఎదురుగాలి వీస్తోంది. పార్టీ ఘోర పరాభవానికి వారినే నిందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశానికి గుండె కాయ లాంటి ఉత్తర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక స్థానాల్లో సైతం ముందంజ వేయలేకపోయింది. దీనికి కారణం మోదీ, అమిత్ షా, ఆదిత్య నాథ్ లే అని చెబుతున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీని గట్టెక్కించే పనిలో భాగంగా మాతృక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నే నమ్ముకుంటున్నారు. ఇన్నాళ్లు ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని గందరగోళంలోకి నె ట్టారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో పార్టీలో ప్రక్షాళనకు నడుం బిగించారు.

మోహన్ భగవత్ ప్రభుత్వ తీరుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. నాయకులుగా ఎవరున్నా సైద్దాంతిక అంశాల్లో రాజీపడకూడదని ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాల్లో ముఖ్యమైనది. నరేంద్రమోడీ పార్టీని మించిన ఇమేజ్ తో ఎదిగారు. ఆర్ఎస్ఎస్ ను కాదని ప్రత్యేక ఎజెండా రూపకల్పన చేయడంతో భగవత్ కు సహజంగా ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన బీజేపీ విజయానికి తోడ్పడిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కాదని మోదీ సొంత నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే కష్టమేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్ షా పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు.

ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీగా కర్ణాటకకు చెందిన దత్తాత్రే హోనబలే బాధ్యతలు స్వీకరించారు. మోదీ, అమిత్ షాలతో దత్తాత్రేయ వివిధ అంశాల్లో చర్చించడానికి సమావేశం అయ్యారు. దేశంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయి. కరోనాను సాకుగా చూపి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో ప్రధానిపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రజలు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఆర్ఎస్ఎస్ ను పక్కన పె డితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇప్పటికైనా మోదీ, అమిత్ షా లు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని నాయకులు చెబుతున్నారు.

బీజేపీకి అత్యధిక సీట్లు తెచ్చిన ఉత్తర ప్రదేశ్. ఇక్కడ తీవ్రవైన మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో పార్టీ పట్టు కోల్పోయింది. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలోనూ పరాజయం పాలైంది. దీంతో ప్రధాని చరిష్మా తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్ఎస్ఎస్ అండతోనే విజయాలు సాధ్యమవుతాయని గుర్తించిన మోదీ, అమిత్ షా దాన్ని కూల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.