PM Kisan: దీని ద్వారా మొత్తము 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో రూ.2 వేలు జమ కానున్నాయి. తమ పేమెంట్ స్టేటస్ను రైతులు దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం కింద నిరంతరం ప్రయోజనం పొందడం కోసం రైతులు ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. రైతులు ఓటిపి, బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. భారతదేశంలో ఉన్న చిన్న, సన్న కారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన పథకం పీఎం కిసాన్ యోజన పథకం. త్వరలో ఈ పథకం 20వ విడతను విడుదల చేయడానికి అధికారులు రెడీగా ఉన్నారు. మే నెల లేదా జూన్ నెల 2025 నాటికి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ విడత నగదు జమ కానున్నాయి.
Also Read: ఆ జిల్లా టిడిపి సీనియర్లలో అసంతృప్తి.. కారణం అదే!
పిఎం కిసాన్ యోజన పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగానికి సహకారం అందించడానికి అలాగే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన గొప్ప పథకం పీఎం కిసాన్ యోజన పథకం. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాదికి రూ.6000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది.ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో విడతకు రూ.2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేలాగా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల 2025లో విజయవంతంగా పీఎం కిసాన్ యోజన 19వ విడతను పంపిణీ చేసింది. ఈ విడతలో దాదాపుగా 9.8 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. వీళ్ళలో 2.41 కోట్ల మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం.
డి బి టి ద్వారా మొత్తం రూ.22,000 కోట్ల రూపాయలను లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేశారు. త్వరలో 20వ విడత విడుదల కానున్న సందర్భంగా రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులను పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. అలాగే ఈ అధికారిక వెబ్సైట్లో రైతులు తమ అర్హత, అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. భార్య భర్తలు అలాగే మైనర్ పిల్లలు ఉన్న సాగుకు అనువైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం కూడా పిఎం కిసాన్ యోజన పథకానికి అర్హులు.
Also Read: అంతా ఓకే.. పథకాలపై ప్రశ్నింవేమయ్యా ఆర్కే!