ఆక్సిజన్ వ్యవస్థ కనిపెట్టిన డీఆర్డీవో..కొనుగోలుకు కేంద్రం డీల్

ఎప్పుడూ విదేశాలపై ఆధారపడకుండా.. మన తెలివితేటలు.. మన పరిశోధనలతో తయారు చేసిన వస్తువులను కొంటే అది మన దేశానికి ఎంతో ప్రయోజనకరం.. మన శాస్త్రవేత్తల మేథస్సుకు విలువ ఇచ్చిన వారం అవుతారు. అందుకే ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పిలుపులో భాగంగా దేశీయ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డివో) ఆక్సిజెన్ వ్యవస్థ “ఆక్సీకేర్” యూనిట్లు రూపొందించింది. ఆక్సిజన్ అందక చనిపోతున్న కరోనా రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలుగనుంది. వీటిని ఇప్పటికే […]

Written By: NARESH, Updated On : May 13, 2021 10:11 am
Follow us on

ఎప్పుడూ విదేశాలపై ఆధారపడకుండా.. మన తెలివితేటలు.. మన పరిశోధనలతో తయారు చేసిన వస్తువులను కొంటే అది మన దేశానికి ఎంతో ప్రయోజనకరం.. మన శాస్త్రవేత్తల మేథస్సుకు విలువ ఇచ్చిన వారం అవుతారు. అందుకే ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పిలుపులో భాగంగా దేశీయ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డివో) ఆక్సిజెన్ వ్యవస్థ “ఆక్సీకేర్” యూనిట్లు రూపొందించింది. ఆక్సిజన్ అందక చనిపోతున్న కరోనా రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలుగనుంది. వీటిని ఇప్పటికే లక్షన్నర ఉత్పత్తి చేసింది.

డీఆర్డీవో రూపొంది. 1.5 లక్షల ఆక్సిజన్ వ్యవస్థల కొనుగోలుకు రూ. 322.5 కోట్లు వెచ్చించటానికి పీఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలియజేసింది. ఆక్సీకేర్ అనేది రోగులకు ఇచ్చే ఆక్సిజెన్ ను నియంత్రించే వ్యవస్థ. ఇప్పుడు కేటాయించిన నిధుల సాయంతో మానవ సాయంతో పనిచేసేవి లక్ష , ఆటోమేటిక్ గా పనిచేసేవి 50 వేలు ఆక్సీకేర్ లు కొనుగోలు చేయవచ్చు. వీటితోబాటు శ్వాసలో సాయపడే మాస్కులు కూడా కొనుగోలు చేస్తారు.

ఈ ఆక్సీకేర్ వ్యవస్థ ఆక్సిజెన్ స్థాయిని బట్టి అవసరమైన అదనపు ఆక్సిజెన్ ను అందించటంతో బాటు ఆ వ్యక్తి ప్రాణాంతకమైన స్థితిలోకి జారిపోకుండా కాపాడుతుంది. దీనిని అత్యంత ఎత్తైన ప్రదేశాలలో పనిచేసే సైనికుల కోసం డిఆర్ డివో కు చెందిన బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబరేటరీ తయారు చేసింది. క్షేత్రస్థాయి సమస్యలకు అనుగుణంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ ఇది. ఇది కోవిడ్-19 రోగుల చికిత్సకు సమర్థంగా పనిచేస్తుంది.

ఈ ఆక్సకేర్ పరికరం రెండు నమూనాల్లో లభిస్తుంది. ప్రాథమిక నమూనాలో 10 లీటర్ల ఆక్సిజెన్ సిలిండర్, ప్రవాహాన్ని నియంత్రించే రెగ్యులేటర్, గాలిలో తేమను కొనసాగించే హ్యుమిడిఫయర్, ముక్కులోకి గాలిని తీసుకువెళ్ళే శ్వాసగొట్టం ఉంటాయి. ఎస్పీఓ2 కొలమానానికి అనుగుణంగా మానవసాయంతో ఆక్సిజెన్ ను నియంత్రిస్తారు. ఇక రెండో నమూనా విషయానికొస్తే, ఆక్సిజెన్ సిలిండర్ తోబాటు ఎలక్ట్రానిక్ నియంత్రణలు అనుసంధానమై ఉంటాయి. అవి వాటంతట అవే రెగ్యులేటర్ సాయంతో ఆక్సిజెన్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి.

రోగి ఆక్సిజెన్ స్థాయిని బట్టి ఆక్సిజెన్ వాడకాన్ని నియంత్రించటం వలన ఈ యంత్రం ఆక్సిజెన్ వృథా కాకుండా సాయపడుతుంది. అందువలన ఆక్సిఎజ్న్ సిలిండర్ ను సమర్థంగా వాడుకోవచ్చు. వైద్య సిబ్బంది ఈ ప్రవాహాన్ని ఎప్పటి కప్పుడు మార్చే వెసులుబాటు ఉంటుంది. ఎస్పీఓ2 స్థాయిని పర్యవేక్షించటానికి వీలుగా అది కనడుతూ ఉంటుంది. మాటిమాటికీ స్వయంగా వచ్చి ఆక్సిజెన్ ప్రవాహాన్ని కొలవాల్సిన అవసరం ఉండదు గనుక వైద్య సిబ్బందికి సమయం కలిసి వస్తుంది.

ఆటోమేటిక్ వ్యవస్థ వలన ఎస్పీఓ2 స్థాయి తగ్గినప్పుడు శబ్దరూపంలో హెచ్చరిక వచ్చే ఏర్పాటు కూడా ఉంది. ఆక్సీకేర్ వ్యవస్థకు నాన్-రీబ్రీతర్ మాస్కులు అనుసంద్థానమై ఉంటాయి. ఆ విధంగా ఆక్సిజెన్ ను మరింత సమర్థవంతంగా వాడుకునే వీలుంటుంది. దీనివలన దాదాపు 30-40% ఆక్సిజెన్ ఆదా అవుతుంది. ఈ ఆక్సీకేర్ వ్యవస్థను ఇంటిలోను, క్వారంటైన్ కేంద్రాల్లోనూ కోవిడ్ కేర్ కేంద్రాల్లోను, ఆస్పత్రులలోను వాడుకోవచ్చు. . ప్రతి రోగికీ ఈ మాస్కులు మార్చాల్సి ఉంటుంది.
డి ఆర్ డి వో సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్సీకేర్ పరికరాలు తయారుచేసే అనేక భారతీయ పరిశ్రమలకు బదలాయించింది. తద్వారా అందరు భారీగా ఉత్పత్తి చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచేలా చేసింది. ఇది కరోనా రోగుల పాలిట ప్రాణవాయువుగా మారింది.