Piyush Pandey: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం.. టీవీలలో ఫెవి క్విక్ కు సంబంధించి ఒక ప్రకటన వచ్చేది. అందులో ఒక వ్యక్తి చెరువులో చేపలు పడుతుంటాడు. ఎంత కష్టపడినప్పటికీ ఒక్క చేప కూడా పడదు. కానీ ఇంతలోనే ఒక వ్యక్తి గేలం లేకుండా.. ఓ కర్ర పుల్లకు ఫెవికాల్ అంటించుకుని వస్తాడు. అలా చెరువులో ఉంచుతాడు.. చూస్తుండగానే చేపల మొత్తం ఆ కర్ర పుల్లకు అంటుకుంటాయి.. అప్పట్లో ఈ ప్రకటన ఒక సంచలనం. ఈ ప్రకటన ఫెవి క్విక్ ఉత్పత్తిని సామాన్య ప్రజలకు కూడా చేరువచేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ ఉత్పత్తికి తిరుగులేదు.
ఫెవి క్విక్ కు యాడ్ రూపొందించిన ఆ వ్యక్తి పేరు పియూష్ పాండే. అతడిని భారతీయ అడ్వర్టైజ్మెంట్ రంగంలో లెజెండ్ అని పిలుస్తుంటారు. ఫెవిక్విక్ మాత్రమే కాకుండా ఫెవికాల్ ప్రకటన కూడా ఆయనే రూపొందించారు. ఏనుగుల కంటే ఎక్కువ బలం ఫెవి కాల్ లో ఉంటుందని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు.. ఇక డెయిరీ మిల్కీ యాడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చాక్లెట్ యాడ్ తర్వాత వచ్చే “తీయని వేడుక చేసుకుందాం” అనే మాట ఆయన సృష్టే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు ఆయన ప్రకటనలు చేశారు. వినూత్నమైన విధానాలలో ప్రకటనలు రూపొందించి సామాన్య ప్రజల మనసులో బలమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
పీయూష్ పాండే రూపొందించిన కమర్షియల్ యాడ్స్ లో విపరీతమైన పేరు సంపాదించి పెట్టింది వోడాఫోన్ కంపెనీకి చేసిన యాడ్. సాధారణంగా ఏ కంపెనీ ఉత్పత్తికైనా సరే మనుషులతోనే ప్రచారం చేస్తారు. అవసరమైతేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. కానీ వోడాఫోన్ కు మాత్రం తొలిసారిగా టెక్నాలజీని ఉపయోగించారు. మనుషులతో సంబంధం లేకుండా ఎమోజీలతో ప్రకటన రూపొందించారు. ఈ ఎమోజీలు వోడాఫోన్ మార్కెట్ వేల్యూ అమాంతం పెంచాయి. అప్పట్లో ఈ ఎమోజీలు సంచలన సృష్టించేవి. కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే కాకుండా.. రాజకీయ పార్టీలకు కూడా పాండే విస్తృతమైన ప్రకటనలు రూపొందించారు. అందులో 2014లో భారతీయ జనతా పార్టీకి రూపొందించిన “అబ్ కీ బార్ మోడీ సర్కార్” అనే నినాదం దేశ రాజకీయాలలోనే సంచలన సృష్టించింది.
పీయూష్ పాండే రూపొందించిన ఆ ప్రకటన బిజెపికి 2014లో అధికారాన్ని దక్కేలా చేసింది. ఇలా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో.. పాదరసం లాంటి తన బుర్రతో ఎన్నో గొప్ప గొప్ప ప్రకటనలు రూపొందించిన పీయూష్ పాండే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. రాజకీయ ప్రముఖులు, శని రంగ ప్రముఖులు పీయూష్ పాండేకు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Shri Piyush Pandey Ji was admired for his creativity. He made a monumental contribution to the world of advertising and communications. I will fondly cherish our interactions over the years. Saddened by his passing away. My thoughts are with his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) October 24, 2025