Sukumar-Ram Charan Movie Updates: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి విజయాలను సాధించి పెట్టాయి…మగధీర సినిమాతో రికార్డు బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. సుకుమార్ తో రంగస్థలం సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పటినుంచి ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది… కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక ఒక టిపికల్ యాక్టింగ్ తో చిట్టి బాబు పాత్రకి ప్రాణం పోశాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మంచి సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే తన ఇమేజ్ తార స్థాయికి వెళ్లిపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సుకుమార్ కెరియర్లో చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు క్లాశేష్ అయితే వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో సుకుమార్ డిఎస్పీ ని పక్కన పెట్టి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను రంగంలోకి దించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ మధ్య దాదాపు 20 సంవత్సరాల నుంచి మంచి బాండింగ్ ఉంది. మరి ఆ బాండింగ్ వదులుకొని సినిమా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొస్తాడా? లేదంటే మరోసారి దేవిశ్రీప్రసాద్ తోనే సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ కనక ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తే మాత్రం సినిమా సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.
ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చేసిన ఏ సినిమా కూడా అంత పెద్దగా సక్సెస్ ను సాధించడం లేదు. కానీ ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడం అలాగే ఆ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అవ్వడంతో దేవిశ్రీప్రసాద్ కి మంచి క్రేజ్ వచ్చింది.
ఇక మరోసారి ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ పనిచేసి తన సత్తా ఏంటో చూపించుకుంటాడా? సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని మరోసారి ప్రూవ్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం మీద సుకుమార్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. తొందరలోనే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…