Who insulted Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో హీరోగా సత్తా చాటుకోవాలంటే చాలా వరకు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. వారసత్వం తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ సక్సెస్ లు దక్కుతాయి అనుకుంటే పొరపాటే…ఎందుకంటే చాలామంది స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకోలేకపోయారు. దాంతో వాళ్ళు చాలా తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇక ఇండస్ట్రీ లో ఎవరైతే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు… నిజానికి ఇక్కడ ఎప్పుడు ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు అనేది ఎవ్వరికి తెలియదు. మొత్తానికైతే సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు…
ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే విస్తిమితమైన అయిన పాన్ వరల్డ్ సినిమా స్థాయికి ఎదగబోతున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాని 1000 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు… ఇక ఈ సినిమా మూడు వేల కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడుతుందని సినిమా యూనిట్ తో పాటు మహేష్ బాబు అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నా సమయంలో అతన్ని చూసిన చాలా మంది అతను చాలా లేతగా ఉన్నాడు. అతని ఫేస్ లో హీరోయిజం కనిపించడం లేదు అంటూ కృష్ణ గారితో చెప్పేవారట. కానీ కృష్ణ మాత్రం మహేష్ బాబు టాప్ పొజిషన్ కి వెళ్తాడని నమ్మాడు. కొంత మంది స్టార్ డైరెక్టర్లను సైతం మహేష్ బాబుతో సినిమా చేయమని కృష్ణ అడిగినప్పటికి వాళ్ళు మాత్రం మహేష్ బాబు తో మేము సినిమా చేయలేము.
ఆయన హీరోగా సెట్ అవ్వడు అంటూ హేళన గా మాట్లాడారట. అయినప్పటికి మహేశ్ బాబు హీరోగా రాణించడం కష్టమని రివర్స్లో కృష్ణ గారికి సలహాలు ఇచ్చారట. మొత్తానికైతే మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…