https://oktelugu.com/

రొమాంటిక్‌ ‘రాధే శ్యామ్‌’

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరీక్షణ ఫలించింది. అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన రెబల్‌ స్టార్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ ఎట్టకేలకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌నే చిత్ర బృందం ఖారారు చేసింది. అంతేకాదు డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ కూడా ఇచ్చింది. రెబల్‌ స్టార్ స్టార్డమ్‌ దృష్ట్యా ఏ యాక్షన్‌ లుక్‌నో వదులుతారని అనుకుంటే రొమాటింక్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. రాయల్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌.. హీరోయిన్‌ పూజా హెగ్డేను ద‌గ్గరగా అదిమిపట్టుకున్న ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 12:36 PM IST
    Follow us on


    ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరీక్షణ ఫలించింది. అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన రెబల్‌ స్టార్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ ఎట్టకేలకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌నే చిత్ర బృందం ఖారారు చేసింది. అంతేకాదు డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ కూడా ఇచ్చింది. రెబల్‌ స్టార్ స్టార్డమ్‌ దృష్ట్యా ఏ యాక్షన్‌ లుక్‌నో వదులుతారని అనుకుంటే రొమాటింక్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. రాయల్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌.. హీరోయిన్‌ పూజా హెగ్డేను ద‌గ్గరగా అదిమిపట్టుకున్న ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. ఖ‌రీదైన క్లాసిక్‌ దుస్తుల్లో ఉన్న ప్రభాస్‌, పూజ డ్యాన్స్‌ చేస్తూ ఇద్దరూ తన్మయత్వంతో ఉన్నారు. సిల్వర్ కలర్ కోటుతో ఉన్న ప్రభాస్‌తో.. గులాబీ కలర్ డ్రెస్‌ల ఉన్న హెగ్డే పర్ఫెక్ట్‌ జోడీలా ఉంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఇటలీ దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినా కల్లోజియం కనిపిస్తుంది. రిలీజైన నిమిషాల్లనే వైరల్‌గా మారిన ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉన్నట్టు క‌నిపిస్తోంది.

    కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

    ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. తెలుగు, త‌మిళం, హింధీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. హాస్యనటుడు ప్రియదర్శి తో పాటు సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, ‘ఎయిర్ టెల్‌ గర్ల్‌’ సాషా ఛేత్రి, బాలీవుడ్‌ నటుడు కునాల్ రాయ్ కపూర్, ‘భీష్మ’ ఫేమ్ సత్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటోంది. లాక్‌డౌన్‌కు ముందు వరకు జార్జియాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకోగా హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ స్టూడియోలో రెండో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు.
    మూవీలో రానా కూడా అతిథి పాత్రలో మెరుస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.