SS Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ఉంటాడు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ ఒక క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి…ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలని ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచంలో కూడా ఆయన ఒక దిగ్గజ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొని 2027 మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక 2022వ సంవత్సరం మార్చి 24 వ తేదీన త్రిబుల్ ఆర్ (RRR) సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ మూవీతో రాజమౌళి దర్శకుడిగా మరొక మెట్టు పైకి ఎదిగాడనే చెప్పాలి. ఈ సినిమాని కూడా 2027 మార్చి 25వ తేదీన రిలీజ్ చేస్తే బావుంటుందని తను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?
ఏప్రిల్ 7 వ తేదీన ఉగాది, ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమి ఉన్న సందర్భంగా ఈ సినిమాకి 15 రోజులపాటు భారీ క్రేజ్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే భారీ గుర్తింపును కూడా సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి…ఇక జక్కన్న ఏది చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడు.
కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా భారీగా చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంక సరిగ్గా ఈ సినిమా రిలీజ్కి రెండు సంవత్సరాల సమయం ఉండడంతో సినిమా నుంచి వీలైనంత తొందరగా గ్లింప్స్ లు టీజర్లు రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు.
కొంచెం కొంచెంగా సినిమా మీద హైప్ ని పెంచి ఒకేసారి బ్లాస్ట్ చేయాలనే ఉద్దేశంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎవరి గ్రీన్ సక్సెస్ ని సాధించి పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?