Key decision of the Center : పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఈపీఎఫ్ కొన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలలో ఒకటి ఇడిఎల్ఐ స్కీమ్. పిఎఫ్ ఖాతా ఉన్నవారు ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా రూ.7 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. ఈ స్కీమ్ తో పాటు పిఎఫ్ ఖాతా ఉన్నవారికి మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఉద్యోగం చేసే వాళ్ళకి భవిష్య నిధి సంస్థలో పిఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. మీకు పిఎఫ్ కాదా ఉన్నట్లయితే మీరు రూ.7 లక్షల రూపాయలు జీవిత బీమా పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా మీకు ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్ను అందిస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఉద్యోగంలో ఉన్న సమయంలో పిఎఫ్ ఖాతాదారుడు మరణించినట్లయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు ఆ ఖాతాదారుడి యొక్క నామినీలకు లేదా చట్టపరమైన వారసులకు ఏడు లక్షల రూపాయలు బీమాను అందిస్తారు.
ఈ డబ్బులు ఉద్యోగం చేసే వ్యక్తి సర్వీస్ పీరియడ్ పై అలాగే అతని చివరి 12 నెలల జీతం పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు సాధారణంగా ఈపీఎఫ్ ఖాతాకు తమ జీవితంలో 12 శాతాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారానే ఉద్యోగం చేస్తున్న వాళ్లకి ఉచిత భీమా అందుతుంది. ఈ డి ఎల్ ఐ పథకం కోసం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్యోగి యొక్క పిఎఫ్ వేతనంలో 0.5% కంపెనీ యాజమాన్యాలు వీటికి చెల్లిస్తాయి. ఉద్యోగం చేస్తున్న ఒక్కొక్కరికి గరిష్టంగా కంపెనీ రూ.75 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. ఈ ప్రీమియం ఉద్యోగి కట్టాల్సిన అవసరం లేదు. జీతం లో నుంచి ఇవి కట్ చేయబడతాయి.
Also Read : ఈ చిన్న ట్రిక్ తో కేంద్ర ప్రభుత్వం అందించే PPF పథకంతో రూ.1 కోటి రూపాయలు పొందొచ్చు.. ఎలాగంటే…
ఇటీవలే ఈపీఎఫ్ఓ ఈ డి ఎల్ ఐ పథకానికి సంబంధించి కొన్ని కీలక మార్పులను చేపట్టింది. ఈ నియమాలు అమలులోకి వస్తే వేలాది మంది ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలు చాలా లభిస్తాయి. ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తుంది. ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను శాఖలో ఉన్న సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి జమ చేస్తున్న డబ్బులకు ఈపీఎఫ్వో వడ్డీ కూడా ఇస్తుంది.