Allu Ayan viral Video : 18 ఏళ్ళ నుండి RCB అభిమానులు IPL ట్రోఫీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. ప్రతీ సంవత్సరం పోరాడడం ఓడిపోవడం ఆ టీం కి అలవాటు అయిపోయింది. ఇక RCB అభిమానులు అయితే ఇతర IPL టీం అభిమానుల నుండి తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకుంటూ RCB అభిమాని అంటేనే జాలి తో చూసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అయితే ఎంతలా ఎదురు చూసారో చెప్పనవసరం లేదు. ప్రతీ సీజన్ లోను RCB తరుపున అత్యధిక పరుగులు టీం ఆ టీం కి ట్రోఫీ దక్కేందుకు కోహ్లీ తన వైపు నుండి నూటికి నూరు శాతం కృషి చేసేవాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు నిన్న కోట్లాది మంది RCB అభిమానుల ఆకాంక్ష, విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆకాంక్ష నెరవేరింది. నిన్న ట్రోఫీ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లీ మైదానం లో ఆనందం తో కన్నీళ్లు పెట్టుకున్నాడు చూసారా, అది కోట్లాది మంది RCB అభిమానుల ఫీలింగ్ కూడా.
అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కుమారుడు అల్లు అయాన్(Allu Ayaan) కూడా RCB టీం కి వీరాభిమాని అనుకుంట. నిన్న ఆ టీం గెలిచిన వెంటనే ఈ బుడ్డోడు చేసిన హంగామా సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఎక్కడ చూసినా చక్కర్లు కొడుతూ ఉంది. అల్లు అర్జున్ తన కుమారుడితో మాట్లాడుతూ ‘నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది’ అంటూ బుగ్గలు పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతాడు. అప్పుడు అల్లు అయాన్ దానికి సమాధానం ఇస్తూ ‘చివరికి మేము ట్రోఫీ గెలుచుకున్నాము’ అంటూ ఎమోషనల్ గా అరుస్తూ పైన నీళ్లు పోసుకున్న వీడియో ని అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది.
అల్లు అర్జున్ కూడా నిన్న ట్విట్టర్ లో ఇన్నేళ్ల మన కోరిక ఇప్పటికి నెరవేరింది, మనం గెలిచాము అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ చూసిన తర్వాత అల్లు అర్జున్ కూడా విరాట్ కోహ్లీ కి పెద్ద అభిమాని లాగా ఉన్నాడని అందరు అంటున్నారు. మరి కొంతమంది అయితే ‘మన’ అని సంబోధిస్తున్నాడేంటి?, అల్లు అర్జున్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆయన కేవలం RCB టీం అభిమానిగా మాత్రమే ట్వీట్ వేసాడు, ప్రతీ దానికి పెడార్థాలు తియ్యకండి అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా అల్లు అయాన్ చేసుకున్న సంబరాలలో తమని తాము చూసుకుంటున్నారు RCB ఫ్యాన్స్.