PPF Scheme : మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడంతో పాటు ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీరు అనుకున్నట్లుగా చేతికి కోటి రూపాయలు వస్తాయి. మరి ఈ పథకానికి ఎన్నేళ్లు పడుతుంది అలాగే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా డిమాండ్ ఉంది. సెక్షన్ 80సి కింద ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. వీటితోపాటు మెచ్యూరిటీ అమౌంట్ కి మరియు వడ్డీకి కూడా ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు మరియు పెళ్లి కోసం చాలా బెస్ట్ ఎంపికగా నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ పథకం మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. ప్రభుత్వం అందించే సురక్షిత పెట్టుబడి పథకాలలో టీపీఎఫ్ పథకం ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.
Also Read : ఇంట్లో నుంచే ఈ వ్యాపారం చేసి లక్షలు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
అయితే ఈ పథకంలో కోటి రూపాయలు రాబడి పొందాలంటే ఏం చేయాలి, పథకం గడువు పొడిగిస్తే ప్రయోజనమేనా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఇందులో సంవత్సరానికి కనీసం రూ.500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 7.1% వడ్డీ అందిస్తుంది. గడువు పూర్తయిన తర్వాత ఈ పథకంలో మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఆ సమయంలో కూడా మీరు పెట్టుబడి పెట్టడం కొనసాగించవచ్చు. లేదా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు కొనసాగించవచ్చు.
ఆ సమయంలో మీరు 60 శాతం ఫండ్స్ విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతినెల పిపీఎఫ్ ఖాతాదారులు ఒకటవ తేదీ నుంచి 5వ తేదీ లోపు పెట్టుబడి చేస్తే ఆ డబ్బులకు సైతం అదే నెల వడ్డీ రేటు అందుతుంది. ఈ క్రమంలో వాళ్లు డబుల్ బెనిఫిట్ పొందొచ్చు. ఈ ఖాతాలో గరిష్ట పరిమితి ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టొచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ఏడాదికి రూ.1.50 లక్షలు 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.40.68 లక్షలు అందుతాయి. ఇందులో మీ పెట్టుబడి రూ.22.5 లక్షలు అలాగే వడ్డీ రూ.18.18 లక్షలు మీ చేతికి వస్తాయి.