అడుగంటుతున్న ఆయిల్ ధర..!

మునుపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి తగ్గుతున్నాయి. అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో తగ్గడమే. రానున్న వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 నుంచి రూ.6 వరకూ తగ్గొచ్చు. వీటికంటే.. ఇంకా తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అయితే ఈ విషయంలో భారత్ లో ఆయిల్ ధరలు తగ్గాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి, ఎందుకంటే.. డిమాండ్ కు తగ్గట్లు […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 3:56 pm
Follow us on


మునుపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి తగ్గుతున్నాయి. అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ స్థాయిలో తగ్గడమే. రానున్న వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 నుంచి రూ.6 వరకూ తగ్గొచ్చు. వీటికంటే.. ఇంకా తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదని కొంతమంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

అయితే ఈ విషయంలో భారత్ లో ఆయిల్ ధరలు తగ్గాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి, ఎందుకంటే.. డిమాండ్ కు తగ్గట్లు పెట్రోల్.. ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ దేశాల చర్చలు ఫలించలేదు. దీంతో సౌదీ ఆరామ్‌ కో మార్కెట్లకు భారీగా చమురును విడుదల చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు 30 శాతానికిపైగా తగ్గాయి. దీంతో.. బ్యారెల్ ముడిచమురు ధర 35 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. అయితే మన దేశానికి వచ్చేసరికి.. చమురు ఉత్పత్తుల ధరలు 15 రోజల తర్వాత సవరిస్తారు. అందుకే.. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గిన వెంటనే.. ఆ ప్రభావం ఉండటం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఎక్సైజ్ సుంకాలు పెంచి తమ ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించొచ్చు. ఒకవేళ సుంకాలు పెంచితే మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.