https://oktelugu.com/

‘వి’వాదాల మధ్య నాని సినిమా..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఊహించని సంక్షోభంలో ఉంది. దాంతో విడుదల కాబోయే సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇపుడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’. కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది .హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ “వి” చిత్రంలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు మెయిన్ హీరోకాగా… ప్రతినాయకుడి పాత్ర లో నాని కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమా […]

Written By: , Updated On : March 12, 2020 / 12:22 PM IST
Follow us on

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఊహించని సంక్షోభంలో ఉంది. దాంతో విడుదల కాబోయే సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇపుడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘వి’. కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది .హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ “వి” చిత్రంలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు మెయిన్ హీరోకాగా… ప్రతినాయకుడి పాత్ర లో నాని కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమా పై అంచనాల్ని బాగానే పెంచేసాయి. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని వార్తలొస్తున్నాయి..

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇప్పుడు సినిమాలకు అన్ సీజన్.దానికి తోడు 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి.. ఇవి సరిపోవు అన్నట్టు… కరోనా వైరస్ భయం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. దరిమిలా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత దిల్ రాజుకి ఫోన్ చేసి ‘వి’ చిత్రన్ని వాయిదా వేయమని కోరారట..ఒక పక్క సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి.అందువల్ల ఈ చిత్ర వాయిదాకు పలు ఇబ్బందులున్నాయి. అదలావుంటే ఈ చిత్రం కంటెంట్ పై నాకు బలమైన నమ్మకం.. కచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పిస్తుంది’ అంటూ నాని ధీమాగా చెబుతున్నాడట. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు.. నాని మాటలతో ఏకీభవించలేకపోతున్నాడని తెలుస్తోంది..
Sometimes fate decides things