పెట్రోల్ 100: ఏం కొనేటట్టు / తినేటట్టు లేదు..

దేశంలో పెట్రోధరలకు రెక్కలొచ్చాయి. రోజూ ధరలు పెంచడంతో చుక్కలనంటుతున్నాయి. సామాన్యుడి నడ్డి విరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగకపోయినా దేశం విపరీతంగా ధరలు పెంచుతూ పోతోంది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు పెట్రోల్ పై 31 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటింది. ఢిల్లీలో రూ95.85కి చేరింది. లీటర్ డీజిల్ ధర […]

Written By: Srinivas, Updated On : June 11, 2021 3:41 pm
Follow us on

దేశంలో పెట్రోధరలకు రెక్కలొచ్చాయి. రోజూ ధరలు పెంచడంతో చుక్కలనంటుతున్నాయి. సామాన్యుడి నడ్డి విరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగకపోయినా దేశం విపరీతంగా ధరలు పెంచుతూ పోతోంది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు పెట్రోల్ పై 31 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెరిగింది.

దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటింది. ఢిల్లీలో రూ95.85కి చేరింది. లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ.94.14 ఢిల్లీలో రూ.86.75గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.100కు చేరువైంది. రాజస్థాన్,మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్ లోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది.

రాజస్థాన్ ోని శ్రీగంగానగర్ జిల్లాలో ఏకంగా రూ. 106.94కు చేరువైంది. దేశంలో ఇదే అత్యధికం. ఈ ప్రాంతంలో డీజిల్ ధర కూడా వంద రూపాయలకు చేరువై రూ.99.80గా ఉంది. మే 4 నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అప్పటి నుంచి 23 సార్లు ధరలను సవరించగా పెట్రోల్ పై రూ.6 వరకు పెరగడం గమనార్హం. వ్యాట్, స్థానిక పన్నులను బట్టి చమురు ధరలు ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రకంగా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.85, డీజిల్ ధర రూ. 86.75, ముంబయిలో పెట్రోల్ ధర రూ.102.04, డీజిల్ ధర రూ.94.15, కోల్ కతలో పెట్రోల్ ధర రూ.95.80, డీజిల్ ధర రూ.89.60, చెన్నైలో పెట్రోల్ ధర రూ.97.19, డీజిల్ ధర రూ.91.42, హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.99.62, డీజిల్ ధర రూ.94.57 గా ఉంది. దీంతో రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలైపోతున్నారు.

పెట్రో ధరలతో అన్ని ముడిపడి ఉండడంతో అన్నింటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుడికి పూట గడవడం కష్టమైపోతోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పెట్రో ధరలు నిత్యం పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయినా కాలచక్రం ఆగడం లేదు. ఇక తప్పదనే ధోరణితో జనం సరిపెట్టుకుని మరీ బతుకు వెళ్లదీస్తున్నారు. కానీ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే బతుకు దుర్భరమైపోతుందని సామాన్యుడి ఆవేదన. ఇప్పటికే ధరలు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.