Petrol Price in Telugu States: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది తెలుగు స్టేట్ల పరిస్థితి. కేంద్రం పెట్రోధరలపై సెస్ తగ్గించినా తెలంగాణ, ఏపీలు మాత్రం వ్యాట్ తగ్గించకుండా తమ జేబులు నింపుకుంటున్నాయి. కేంద్రంపైనే భారం వేస్తూ తప్పుకోవడం సంచలనం కలిగిస్తోంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో భారీగా ధరలు తగ్గినా తెలుగు ప్రాంతాలు మాత్రం ససేమిరా అంటుండటం మొండికేయడమే అని పలువురు వాదిస్తున్నారు. తాము ధరలు తగ్గించేది లేదని చెబుతన్నాయి.
కేంద్రం విధించే పన్నుల్లో స్టేట్లకు 41 శాతం అందుతుంది. ఇందులో భాగంగా పెట్రోల్ పై కూడా రాష్ర్ట ప్రభుత్వాలకే ఎక్కువ మొత్తం వస్తుందనేది అందరి వాదన. ఉదాహరణకు రూ.100 ల్లో కేంద్రం వాటా 31 శాతం కాగా రాష్ర్టం వాటా 35 శాతంగా ఉంటోంది. దీన్ని రాష్ర్ట ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. దీంతో కేంద్రమే భరించాలని వితండ వాదం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి.
పెట్రోధరలు పెంచిన ప్రతిసారి రాష్ర్ట ప్రభుత్వాల వాటా పెరుగుతూ వస్తోంది. కానీ ఇవేమీ తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వాలు మాట్లాడటం దారుణంగా ఉంది. ఏపీలో పెట్రోల్ ధర రూ.115 ఉండగా పక్కనున్న కర్ణాటక రాష్ర్టంలో దాదాపు రూ.11 ల తేడా ఉండటం గమనార్హం. దీనిపై జగన్ ప్రభుత్వం స్పందించడం లేదు. కేంద్రం తగ్గించినా తమకు సంబంధం లేదని చెబుతూ దాట వేస్తున్నాయి.
కేంద్రమే తగ్గించుకోవాలి మేం మాత్రం తగ్గేదేలేదని తెలంగాణ, ఏపీ చెబుతున్నాయి. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రో దోపిడీపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది.
Also Read: పర్యావరణ క్షీణతకు పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి పెరగడమే కారణమా..?
పెట్రో రేట్ల తగ్గింపు: పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత.. దీపావళి పండుగ చేసుకోవలట!