
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా చేస్తున్నాం అని ప్రకటించారు గాని, ఏ సినిమా చేస్తున్నారు ? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ? లాంటి అంశాల పై కనీసం రూమర్స్ కూడా రావడం లేదంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ పుట్టుకొచ్చింది.
న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమా కథ గురించి, కథలో పవన్ పాత్ర గురించి.. అలాగే ఈ సినిమాలో హరీష్ శంకర్(Harish Shankar).. పవన్ ను ఎలా చూపించబోతున్నాడు ? లాంటి విషయాల పై మొత్తానికి రూమర్స్ మొదలయ్యాయి. హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ పై ఓ ప్లాష్ బ్యాక్ రాశాడట. ఆ ప్లాష్ బ్యాక్ లో పవన్ పక్కా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట.
అయితే, ఆ ప్లాష్ బ్యాక్ లో ఆ సిన్సియర్ పోలీస్ ను ప్రజలే తమ స్వార్థంతో బలి చేస్తారు. దాంతో ఆ పోలీస్ కొడుకు యంగ్ పవన్ ప్రజల పై ఎలా పగ తీర్చుకున్నాడు ? చివరకు ప్రజల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ? అనేది మెయిన్ కథ. మొత్తానికి ఈ కథ పవన్ రాజకీయాలకు బాగా పనికొచ్చేలా ఉంది. ఇక తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవనే నటించబోతున్నాడు.
నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. మెయిన్ గా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే, హరీష్ శంకర్ తెలివిగా పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ పెట్టుకున్నాడు. అలాగే తన కథకి మంచి కమర్షియల్ అంశాలు కూడా బాగా అద్దాడు.
మొత్తానికి హరీష్ శంకర్ ఇలా అన్ని హీరోయిజం ఎలిమెంట్స్ ను తన స్క్రిప్ట్ లో యాడ్ చేసుకుని.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తీయాలని గట్టిగా ప్లాన్ చేశాడు. మరి హరీష్ ఈ సినిమాతో పవన్ పూర్వ మాస్ వైభవాన్ని తెలుగు తెరకు మరోసారి ఘనంగా చాటి చెప్పగలడా ? చూడాలి.
Also Read: పవన్ ‘ఉక్కు పోరాటం’ అసలు కథేంటి..?