బ్రేకింగ్: జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుప్రీంలో పిటీషన్

సీఎం జగన్ ఇటీవల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ఆ మంటలు ఇంకా ఆరడం లేదు. ఈ క్రమంలోనే జగన్ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. కొందరు సీఎం జగన్ రాసిన లేఖకు మద్దతుగా స్పందిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది. Also Read: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..? ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ […]

Written By: NARESH, Updated On : October 15, 2020 9:49 am
Follow us on

సీఎం జగన్ ఇటీవల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ఆ మంటలు ఇంకా ఆరడం లేదు. ఈ క్రమంలోనే జగన్ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. కొందరు సీఎం జగన్ రాసిన లేఖకు మద్దతుగా స్పందిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది.

Also Read: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ లు జగన్ లేఖకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. జాతీయ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది.

ఇక జగన్ రాసిన లేఖకు వ్యతిరేకత కూడా వెల్లువెత్తుతోంది. తాజాగా జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది.

సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేసిన సీఎం జగన్ పై న్యాయవాదులు జీ.ఎస్. మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ పై దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పిటీషన్ లో పేర్కొన్నారు. మనిలాండరింగ్ కేసు కూడా నమోదైందని మణి, ప్రదీప్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: జగన్‌ లేఖ: ప్రశాంత్ భూషణ్‌ రచ్చ చేస్తున్నాడే?

దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది? జగన్ పై చర్యలు తీసుకుంటుందా? లేక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.