వెలుగులోకి మరో కొత్త లక్షణం.. ఇది మరీ ప్రమాదకరం..!

భారత్ లో గత కొన్ని రోజుల నుంచి సెప్టెంబర్ నెలలో నమోదైన రోజువారి కేసులతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా ప్రభావం రోజురోజుకు తగ్గుతోంది. అయితే ఇలాంటి సమయంలోనే మరింత జాగ్రత్తగా ఉండాలని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో కరోనా కొత్త లక్షణం […]

Written By: Navya, Updated On : October 14, 2020 9:28 pm
Follow us on

భారత్ లో గత కొన్ని రోజుల నుంచి సెప్టెంబర్ నెలలో నమోదైన రోజువారి కేసులతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా ప్రభావం రోజురోజుకు తగ్గుతోంది. అయితే ఇలాంటి సమయంలోనే మరింత జాగ్రత్తగా ఉండాలని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో కరోనా కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. మొదట్లో శాస్త్రవేత్తలు జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత లక్షణాలను కరోనా వైరస్ లక్షణాలుగా చెప్పారు. ఆ తరువాత రుచి, వాసన కోల్పోవడం, కళ్లు ఎర్రబడటం, లాంటి లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఎక్కిళ్లు కూడా కరోనా లక్షణమేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం కూడా కరోనా లక్షణమేనని వెల్లడించారు.

మిగతా లక్షణాలతో ఈ లక్షణం మరీ ప్రమాదకరం అని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కరోనా లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా ఆక్సిజన్‌ స్థాయిలను పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రక్తంలో 95 శాతం కంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే అసాధారణంగా పరిగణించాలని.. పల్స్ ఆక్సీమీటర్ సహాయంతో ఆక్సిజన్ లెవెల్స్ తెలుస్తాయని చెబుతున్నారు.

కరోనా సోకిన అందరిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకపోయినా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే మాత్రం కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రెగ్యులర్ గా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవడం వల్ల కరోనాను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.